BALAKRISHNA KS RAVI KUMAR MOVIE REGULAR SHOOTING STARTS FROM 9TH AUGUST AT BANGKOK ALONG WITH HEROINS SONAL CHAUHAN VEDHIKA TA
’ఇద్దరు అమ్మాయిలతో’ బాలకృష్ణ బ్యాంకాక్ టూర్ ..
బాలకృష్ (ఫైల్ ఫోటో)
బాలకృష్ణ, కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తర్వాతి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసాడు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 9న బ్యాంకాక్‌లో ప్రారంభం కానున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
బాలకృష్ణ, కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తర్వాతి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసాడు.అంతేకాదు ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా కానేచ్చేసాడు. ఇక ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టినా.. ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 9న బ్యాంకాక్‌లో ప్రారంభం కానున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ నుంచి ఎలా గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడనేదే ఈ సినిమా స్టోరీ. ఫుల్ ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియండెట్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యుయల్ రోల్లో యాక్ట్ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో బాలకృష్ణ సరసన లెజెండ్ భామ సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటించనున్నారు. నమిత మరోముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమచారం.
బ్యాంకాక్‌లో ముందుగా బాలయ్య, సోనాల్ చౌహాన్, వేదికలపై రెండు పాటలను చిత్రీకరించడంతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణను ఢీ కొట్టే విలన్ పాత్రలో జగపతి బాబు యాక్ట్ చేస్తున్నాడు.అంతేకాదు ఈ సినిమాలో జగపతి బాబు కూడా తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభియం చేయనున్నట్టు సమాచారం.ఈ సినిమాను ఐతే.. సంక్రాంతికి లేకుంటే సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాకు ‘రూలర్’ అనే టైటిల్ దాదాపు ఖరారైంది. మరోవైపు ‘క్రాంతి’అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారు. మొత్తానికి బాలయ్య కొత్త సినిమాకు ఏ టైటిల్ ఖరారు చేస్తారో చూడాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.