హోమ్ /వార్తలు /సినిమా /

Balakrishna - Koratala Siva : బాలకృష్ణ, మరో స్టార్ హీరోతో కొరటాల శివ మల్టీస్టారర్.. ?

Balakrishna - Koratala Siva : బాలకృష్ణ, మరో స్టార్ హీరోతో కొరటాల శివ మల్టీస్టారర్.. ?

బాలకృష్ణ,కొరటాల శివ (Twitter/Photo)

బాలకృష్ణ,కొరటాల శివ (Twitter/Photo)

Balakrishna - Koratala Siva : బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా సెట్ అయిందా.. ? త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలుబడనుందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

  Balakrishna - Koratala Siva : బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా సెట్ అయిందా.. ? త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలుబడనుందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం బాలయ్య నటించిన ‘అఖండ’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ‘అఖండ’ తర్వాత బాలకృష్ణ తన 107వ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. రీసెంట్‌గా ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

  బాలకృష్ణతో చేయబోయే సినిమాను గోపీచంద్ మలినేని తనదైన యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌కు రియలిస్టిక్ స్టోరీతో పల్నాడు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.. ఈ సినిమాలో బాలయ్య మరోసారి ఫ్యాక్షన్ లీడర్‌గా, పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాకు ‘వేట పాలెం’ లేదా  ‘జై బాలయ్య’ టైటిల్స్ పరిశీలిస్తున్నారు.

  Malluwood Heroes In Tollywood : మోహన్‌లాల్,మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాజిల్ సహా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళీ హీరోలు..

  గోపీచంద్ మలినేని సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నట్టు అభిమానులతో  బాలయ్య కన్ఫామ్ చేసారు. గతంలో అనిల్ రావిపూడి బాలకృష్ణ 100వ సినిమా సమయంలోనే ఆయనకి ఒక కథను వినిపించాడట. అప్పట్లో ఈ కాంబినేషన్ సెట్ కాలేదు. కానీ అనిల్ రావిపూడి అదే కథను కొన్ని మార్పులతో బాలయ్యను ఒప్పించారు.

  Balakrishna - Kodandarami Reddy : బాలకృష్ణ, కోదండరామిరెడ్డి సహా టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్..

  ఈ సినిమా తర్వాత ఈ చిత్రాన్నిషైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్నారు. ఈ సినిమాను అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా తర్వాత  పట్టాలెక్కనుంది. ఇక బాలయ్య కూడా గోపిచంద్ మలినేని సినిమాతో తర్వాత అనిల్ రావిపూడి సినిమాను చేయనున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య, కొరటాల శివ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

  బాలయ్య, కొరటాల శివ (File/Photo)

  దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఒక వేళ వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే అభిమానులకు పండగే. ప్రస్తుతం కొరటాల శివ.. చిరంజీవి, రామ్ చరణ్‌లతో ఆచార్య సినిమా చేసారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్‌ చేయనున్నారు. ఆ తర్వాత వీళ్లిద్దరి సినిమా ఉండే అవకాశం ఉంది. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రంలో మరో హీరో కూడా నటించే ఛాన్స్ ఉంది. అది మెగా హీరోనా.. లేకపోతే.. మహేష్ బాబునా అనేది తెలియాల్సి ఉంది. ఇక కొరటాల శివ గతంలో బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘సింహా’ సినిమాకు అసిస్టెంట్‌గా పనిచేసారు. మొత్తంగా బాలయ్యతో కొరటాల శివ ఎలాంటి సినిమా తెరకెక్కిస్తాడనేది చూడాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Akhanda movie, Balakrishna, Koratala siva, NBK, NBK 107, Tollywood

  ఉత్తమ కథలు