హోమ్ /వార్తలు /సినిమా /

మహానాయకుడు ఎఫెక్ట్.. ఎన్టీఆర్ బయోపిక్ ఫ్లాప్ బాధ్యత ఎవరిది ?

మహానాయకుడు ఎఫెక్ట్.. ఎన్టీఆర్ బయోపిక్ ఫ్లాప్ బాధ్యత ఎవరిది ?

ఓ దశలో బాలయ్య వందో సినిమా ‘రైతు’ అవుతుందని కూడా ప్రచారం జరిగింది.

ఓ దశలో బాలయ్య వందో సినిమా ‘రైతు’ అవుతుందని కూడా ప్రచారం జరిగింది.

NTR mahanayakudu | ఎన్టీఆర్ కథానాయకుడు’ మొత్తం ఎన్టీఆర్‌ను దేవుడిగా చూపించడంతోనే సరిపోయింది. మరోవైపు ఎమోషనల్ కంటెంట్ లేకపోవడంతో ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. మరోవైపు తాజాగా విడుదలైన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా కంటెంట్ పరంగా ఎమోషనల్ పరంగా బాగున్నా..కథానాయకుడు ఎఫెక్ట్‌తో ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఇంకా చదవండి ...

    మహానటుడు  దివంగత నేత  ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ఆయన తనయుడు బాలకృష్ణ బయోపిక్‌ను తెరకెక్కిస్తానని చెప్పాడో..అప్పటి నుంచి ఎన్టీఆర్ మూవీ టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. ఈ సినిమాను ఒక పార్టుగా కాకుండా..ఆయన సినీ జీవితాన్ని ‘ఎన్టీఆర్ కథానాయకుడు’గా, రాజకీయ జీవితాన్ని ‘ఎన్టీఆర్ మహానాయకుడు’గా తెరకెక్కించాడు.


    సంక్రాంతి రేసులో విడుదలైన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సోదిలో లేకుండా డిజాస్టర్‌గా నిలిచింది. అప్పటి వరకు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ‘కథానాయకుడు’ సినిమా సక్సెస్ అవుతుందని అందరు అనుకున్నారు. సంక్రాంతి పోటీలో ఏ సినిమాకు లేనంత హైప్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’పైనే ఉండే. చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు కథానాయకుడు చరిత్ర సృష్టిస్తుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ సినిమా చరిత్ర కలిసిపోవడంతో నందమూరి అభిమానులు  నిరాశకు గురయ్యారు.


    ఎన్టీఆర్ కథానాయకుడు’ మొత్తం ఎన్టీఆర్‌ను దేవుడిగా చూపించడంతోనే సరిపోయింది. మరోవైపు ఎమోషనల్ కంటెంట్ లేకపోవడంతో ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. మరోవైపు తాజాగా విడుదలైన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా కంటెంట్ పరంగా ఎమోషనల్ పరంగా బాగున్నా..కథానాయకుడు ఎఫెక్ట్‌తో ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ సినిమాలో ముఖ్యంగా నాదెండ్ల భాస్కరరావును విలన్‌గా చూపించి..చంద్రబాబు నాయుడు వల్లే ఎన్టీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారని ఈ సినిమాలో చూపించారు. మొత్తానికి మహానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ మహానాయకుడులా కాకుండా చంద్రబాబు మహానాయకుడులా కనబడటం కొసమెరుపు.


    అది కరెక్టే అయినా.. ఈ సినిమాను ఎన్టీఆర్ చనిపోవడంతో ఎండ్ చేయకుండా..బసవ తారకం కనుమూయడంతో ఈ సినిమాను ముగించారు. ఇక సినిమాకు ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ అనే టైటిల్ కాకుండా..‘బసవతారకం ఎన్టీఆర్’ లేకపోతే ‘తారకరాముడు’  టైటిల్ పెడితే బాగుండేదనే కామెంట్స్ వినబడ్డాయి.


    మొత్తానికి ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ను రెండు పార్టులుగా తెరకెక్కించి బాలకృష్ణ చారిత్రక తప్పిదం చేసాడు. ఒకే పార్టుగా తీసుంటే కొంతలో కొంత బెటర్‌గా ఉండేది. మొత్తనికి చరిత్రలో నిలిచిపోతుందనుకునే ‘ఎన్టీఆర్’ బయోపిక్‌తో తన తండ్రికి తీరని అవమానం మిగిల్చాడు బాలకృష్ణ. మొత్తానికి కోరి కోరి తండ్రి జీవితాన్ని తెరకెక్కించి బాలకృష్ణ అప్రతిష్ట పాలు అయ్యాడు.


    .

    First published:

    Tags: Balakrishna, Krish, NTR, NTR Biopic, NTR Mahanayakudu, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు