HOME »NEWS »MOVIE »balakrishna is in full swing five films in his hand here are the details sr

Balakrishna : బాలయ్య 2021లో వీర విజృంభణ.. ఇక దబిడిదిబిడే..

Balakrishna : బాలయ్య 2021లో వీర విజృంభణ.. ఇక దబిడిదిబిడే..
బాలకృష్ణ Photo : Twitter

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

  • Share this:
    నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వర్కింగ్ టైటిల్ #BB3తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. లాక్ డౌన్‌లో ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వడంతో షూటింగ్‌ను మళ్లీ మొదలు పెట్టింది చిత్రబృందం. ఈ సినిమా ఇలా ఉండగానే ఆయన మరికొన్ని సినిమాలకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలను ఒప్పుకుంటున్నాడు బాలయ్య. అందులో బాగంగా తాజాగా బాలయ్య చంద్ర సిద్దార్థ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పాడట. చంద్ర సిద్దార్థ్ చెప్పిన కథ నచ్చడంతో ఆయన దర్శకత్వంలో చేయడానికి ఓకే చెప్పాడట. ఇక ఆ సినిమాతో పాటు బాలయ్య, దర్శకుడు శ్రీవాస్ సినిమాని కూడా ఫైనల్ చేశాడని తెలుస్తోంది. ఇక తన కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన బి గోపాల్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయబోతున్నాడు బాలయ్య. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ఇప్పటికే పూర్తి చేసుకుందని సమాచారం. సాయి మాధవ్ బుర్రా ఈ సినిమా కోసం అదిరిపోయే స్క్రిప్ట్ ను రెడీ చేశాడట.

    ఇక వీటికి తోడు ఇస్మార్ట్ శంకర్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మరో సినిమా రాబోతోంది. పూరి జగన్నాధ్ బాలయ్య’ కలయికలో గతంలో పైసా వసూల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇదే కాంబినేషన్‌లో మరో సినిమా రానుంది. ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవ్వగానే బాలయ్యతో సినిమా ఉండనుందని టాక్. లాక్ డౌన్‌లోనే పూరి ఓ క్రేజీ కథను బాలయ్య కోసం రాశాడట. అంతేకాదు ఇప్పటికే పూరి, బాలయ్యకి కథ వినిపించాడని బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఇక ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో మొత్తలం బాలయ్య లిస్టులో ఇప్పుడు ఐదు సినిమాలు ఉన్నాయి.




    ఇక బాలయ్య చేస్తోన్న ప్రస్తుత సినిమా విషయానికి వస్తే... ఊర మాస్ సినిమాల డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఆయన ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నాడు. తొలి రెండు సినిమాలు 'సింహా', 'లెజెండ్'.. ఒకదాన్ని మించి మరొకటి భారీ విజయం సాధించడంతో ఈ బీబీ3 మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ మూవీతో వారు హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బాలయ్య ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. అది అలా ఉంటే బాలయ్య సినిమాలో ప్రముఖ పాత్ర పోషించే విలన్ పాత్ర ఇప్పటి వరకు ఫైనల్ కాలేదు.  విలన్ పాత్రధారి ఎంపిక పూర్తికాకపోవడం బోయపాటిని కలవరపరుస్తోందట. ఈ మూవీలో ఒకరికి మించి ఎక్కువగా విలన్లు ఉంటారనీ, వారిలో ఓ విలన్‌గా ఇప్పటికే నవీన్ చంద్ర ఎంపికయ్యాడనీ అంటున్నారు. 'అరవింద సమేత'లో నెగటివ్ రోల్‌లో ఆకట్టుకున్న అతడికి మరోసారి ఆ తరహా రోల్ చేసే అవకాశం లభించింది. అయితే రెండో షెడ్యూల్ జరుగుతున్నా ఇంతవరకు మెయిన్ విలన్‌ను ఎంపిక చేయలేకపోవడం మాత్రం చిత్రబృందానికి ఇబ్బందికరమైన విషయమే. అయితే ఇదే రోల్ కోసం గతంలో సంజయ్ దత్‌ను సంప్రదించగా.. ఆయన దాన్ని తిరస్కరించారని టాక్. ఆ తర్వాత ఇదే రోల్ కోసం సోనూ సూద్‌ను అడిగితే అతను కూడా  ఆ ఆఫర్‌ను వద్దన్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రచారంలోకి వచ్చింది. దీంతో చివరకు బోయపాటికి విలన్‌గా ఎవరు దొరుకుతారో చూడాలి.



    ఇక ఈ సినిమాలో కొంత బాగాన్ని అంటే పలు కీలక, యాక్షన్ సన్నివేశాలను వారణాసిలో చిత్రీకరించాలని భావించారు బోయపాటి. అయితే లాక్ డౌన్ మూలంగా అది కుదరలేదు. ఇప్పుడు అదే షెడ్యూల్ నంద్యాలలో చేయనున్నారు. నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో షూటింగ్ జరపనున్నారు. ఇందులో ఎక్కువగా పోరాట సన్నివేశాలే ఉంటాయట. ఈ సినిమాలో మరొక ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఇందులో నెగెటివ్ రోల్ చేస్తుండగా బోయపాటి ప్రతి సినిమాలోనూ హీరోకు సమానంగా విలన్ పాత్రలు ఉంటాయి. అప్పుడే హీరో పాత్ర బలంగా ఎలివేట్ అవుతుందనేది బోయపాటి సూత్రం. అందుకే బాలయ్యకు సరిసమానమైన స్టేచర్ కలిగిన నటుడి కోసం వెతుకుతున్నాడట.

    ఇక నిన్నటి మొన్నటి దాకా హీరోయిన్ల ఎంపిక విషయంలో ఎన్నో రూమర్స్ విన్నాం. ఈ క్రమంలో అనేకమంది తారల పేర్లు వినిపించాక, సయేషా సైగల్ పేరును ప్రకటించింది చిత్రబృందం. తర్వాత ఆమె స్థానంలో అవకాశాలు లేక ఖాళీగా ఉన్న ప్రగ్యా జైస్వాల్ వచ్చింది. ఇక మరో హీరోయిన్‌గా పూర్ణ ఖాయం అయ్యింది. అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలైంది. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించునేందుకు ప్రయత్నిస్తోందట. అందులో భాగంగా స్ట్రీమింగ్ రైట్స్ కోసం అమెజాన్ సంస్థ ఏకంగా 9 నుంచి 10 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
    Published by:Suresh Rachamalla
    First published:December 29, 2020, 11:49 IST