ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కంటే బాలకృష్ణ చాలా బెటర్..

సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్,టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యవహరించిన తీరు ఇపుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 11, 2019, 3:23 PM IST
ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కంటే బాలకృష్ణ చాలా బెటర్..
పవన్ కళ్యాణ్,బాలకృష్ణ
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 11, 2019, 3:23 PM IST
ఈ రోజు ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఓటు వేసేందకు క్యూలో నిలబడకుండా సరాసరి వెళ్లి ఓటు వేయడాన్ని అక్కడ ఓటర్లతో పాటు సామాన్య జనాలను అవాక్కయ్యేలా చేసింది. తమను తోసుకుంటూ పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్లిపోవడం సమంజసం కాదనీ తోటీ ఓటర్లు పవర్ స్టార్ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. రేపు అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి ఇలా ఓటు వేయడానికి క్యూలో నిలబడకుండా నేరుగా పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడాన్ని సామాన్య జనాలు సోషల్ మీడియా వేదిక ట్రోల్ చేస్తున్నారు. ఈ ఆరోపణలను జనసేన కార్యకర్తలు తప్పుపట్టారు. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన సమయంలో చిరు కూడా ఇదే రీతిన ప్రవర్తించడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. అప్పట్లో చిరంజీవి కేంద్ర మంత్రి హోదాలో ఉన్న ఆయన్ను ఓటు వేసేందుకు రావాలని కొందరు పిలవడంతో చిరంజీవి క్యూలో నిలబడకుండా తిన్నగా ముందుకు వెళ్లిపోతుంటే... ఎన్నారై సాఫ్ట్‌వేర్ కుర్రాడు కార్తీక్ అడ్డుకున్నాడు. మీరు అలా వెళ్లిపోతుంటే... క్యూలో ఉన్న మేమంతా పిచ్చోళ్లమా అంటూ గట్టిగానే ప్రశ్నించాడు. దీంతో చిరంజీవి..క్యూ వెళ్లి ఓటు వేసారు.

ఇక ఎలక్షన్ సమయంలో టీడీపీ కార్యకర్తలతో పాటు అభిమానులపై దురుసుగా ప్రవర్తించే బాలకృష్ణ మాత్రం ఎలక్షన్ రోజున పద్దతిగా క్యూలో అరగంటకు పైగా నిలబడి తన సతీమణి వసుంధర దేవితో కలిసి ఓటు వేసారు. దీంతో ఎలక్షన్ ప్రచార సమయంలో అభిమానులు, ప్రజలు, కార్యకర్తలతో దుందుడుకుగా ప్రవర్తించే బాలయ్య ..ఎలక్షన్ రోజున క్యూ నిలుచొని  ఓటు వేయడాన్ని టీడీపీ కార్యకర్తలతో పాటు సామాన్య జనాలు అందరు బాలకృష్ణ వ్యవహరించిన తీరును మెచ్చుకుంటున్నారు. మొత్తానికి ఎలక్షన్ రోజున పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఓటు వేసిన తీరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.
First published: April 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...