Home /News /movies /

BALAKRISHNA IS ALL SET TO MAKE HIS DEBUT IN A FILM WITH RAVI TEJA AS THE DIRECTOR MK

BalaKrishna New Movie: రవితేజ డైరక్టర్‌తో బాలయ్య సిినిమాకు త్వరలో కొబ్బరికాయ...జోరుమీదున్న అఖండ...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఇప్పుడు బాలయ్య చేతిలో వరుస ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. వరుసగా యువ దర్శకులకు బాలయ్య అవకాశాలిస్తున్నారు. ఇప్పటికే ఆ వరుసలో అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్ లాంటి టాప్ డైరక్టర్లు ఉండగా లైన్లో ఉండగా ఆ వరుసలో మరో దర్శకులు వచ్చి చేరాడు.

ఇంకా చదవండి ...
    అఖండ చిత్రంతో ఇండస్ట్రీ రికార్డును తిరగేసిన నందమూరి బాలకృష్ణ, ఇక జూలువిదిల్చిన సింహంలా దూసుకెళ్తున్నాడు. వరుస ప్రాజెక్టులకు ఓకే చెబుతున్నారు. ఇప్పటికే గోపీచంద్ మలినేని డైరక్షన్లో NBK 107 ప్రొడక్షన్ టైటిల్ తో షూటింగ్ ప్రారంభంచేందుకు సిద్ధం అవుతుండగా, తాజాగా మరో అప్డేట్ బాలయ్య అభిమానుల్లో ఆనందం నింపుతోంది. ఇప్పటికే కరోనా కోరల్లో చిక్కుకొని థియేటర్లు మూసివేసిన థియేటర్లను బాలయ్య అఖండతో కొబ్బరికాయ కొట్టి మరీ తెరిపించాడు. భారీ బడ్జెట్ సినిమాలను సైతం విడుదల చేయకుండా ఎడిటింగ్ రూములకు పరిమితం అయిన నేపథ్యంలో బాలయ్య అఖండ టాలీవుడ్ కు కొత్త జోష్ తెచ్చింది. తన కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా అఖండ నిలవడంతో బాలయ్య కూడా మంచి జోరుమీదున్నారు. ఇప్పుడు బాలయ్య చేతిలో వరుస ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. వరుసగా యువ దర్శకులకు బాలయ్య అవకాశాలిస్తున్నారు. ఇప్పటికే ఆ వరుసలో అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్ లాంటి టాప్ డైరక్టర్లు ఉండగా లైన్లో ఉండగా ఆ వరుసలో మరో దర్శకులు వచ్చి చేరాడు.

    సీటీమార్ సినిమాతో తనలోని యాక్షన్ యాంగిల్ ను టాలీవుడ్ కు పరిచయం చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది బాలయ్య జత కట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని సంపత్ నంది స్వయంగా వెల్లడించడం విశేషం. అయితే సంపత్ నంది వేములవాడ దేవాలయానికి వెళ్లి స్క్రిప్ట్ కాపీని శ్రీ రాజ రాజేశ్వర స్వామి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపాడు. సంపత్ నందితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్  సైతం ఉండటం విశేషం.

    ఇదిలా ఉంటే ‘అఖండ’ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ 107వ సినిమా అతి త్వరలో పట్టాలెక్కబోతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు నవంబర్ నెలలోనే జరిగాయి. అటు F3 తర్వాత అనిల్ రావిపూడి బాలకృష్ణ కోసం ఓ కథ రెడీ చేశాడు. గోపీచంద్ సినిమా తర్వాత ఈ సినిమా మొదలయ్యే అవకాశముందని ఫిలిం నగర్ టాక్ వినిపిస్తోంది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Balakrishna, Nandamuri balakrishna

    తదుపరి వార్తలు