తన తండ్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ తర్వాత ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, సినీ జీవితానికి సంబంధించి పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా నాగబాబు ఇష్యూతో పాటు ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ సహా తన కూతురు నారా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ పై కీలక వ్యాఖ్యలు చేసారు బాలయ్య. నారా బ్రాహ్మణి.. కేవలం బాలయ్య కూతరుగానే కాకుండా.. స్వర్గీయ ఎన్టీఆర్ మనవరాలిగా.. నారా చంద్రబాబు కోడలిగా.. నారా లోకేష్ ఇల్లాలిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు చంద్రబాబుకు సంబంధించిన హెరిటేజ్ విషయాలను ఆమె చూసుకుంటుంది. ఇక బ్రాహ్మణి ఇంట్లో ఉన్నపుడు రాజకీయాల గురించి అసలు మాట్లాడదన్నారు బాలయ్య. ఇక ప్రతి వారం నేను నా అల్లుళ్లతో సమావేశమవుతాము. ఈ సందర్భంగా మేమెవరము ఆమెతో రాజకీయాల గురించి ప్రస్తావించము. ఇక బ్రాహ్మణి కూడా మా ముందుర పొలిటికల్ ఇష్యూస్ ఏవి తీసుకురాదు. ఇక బ్రాహ్మణి రాజకీయాల్లో రావడం, రాకపోవడం పూర్తిగా ఆమె ఇష్టం పైనే ఆధారపడి ఉంటుందని బాలయ్య పేర్కొన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Balayya, Jr ntr, Nara Brahmani, Tollywood