• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BALAKRISHNA INTERESTING COMMENTS ON MOKSHAGNA AND HIS ENTRY IN MOVIES SR

బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. నట వారసుడు వస్తున్నాడు..

బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. నట వారసుడు వస్తున్నాడు..

బాలయ్య, మోక్షజ్ణ Photo : Twitter

మోక్షజ్ఞ‌కి సినిమాల్లో నటించడంపై పెద్దగా ఆసక్తి లేదని ప్రచారం జరుగుతున్న వేళా.. బాలయ్య ఓ ఆసక్తికర సమాదానం ఇచ్చాడు.

  • Share this:
    నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది. అది అలా ఉంటే బాలయ్య నటవారసుడు మోక్షజ్ఞకి సినిమా ఎంట్రీ గురించి తాజాగా మరోసారి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. మోక్షజ్ఞ‌కి సినిమాల్లో నటించడంపై పెద్దగా ఆసక్తి లేదని ప్రచారం జరుగుతుండగా.. ఓ పక్క పాతికేళ్ళు దాటినా ఆయన ఇంకా వెండి తెరకు పరిచయం కాకపోవడంతో పాటు ఎటువంటీ అప్ డేట్ లేక పోవడంతో ఆ వార్త నిజమే అని భావించారు సినీ ప్రియులు. అయితే ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాడు బాలయ్య. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించాడు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబందించిన ఓ ప్రశ్నకు సమాదానంగా ఆయన ఆసక్తికర సమాధానం చెప్పాడు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ దేవతలు ఆశీర్వదించిన రోజున జరుగుతుందని పేర్కోంటూ.. సినిమాలపై మోక్షజ్ఞకు ఆసక్తి ఉందని, మంచి మూడ్ చూసి లాంచ్ చేయడమే తరువాయి అన్నాడు. దీంతో కొంచెం లేటైనా మోక్షజ్ఞ సినిమాలలోకి రావడం ఖాయం అని తెలుస్తుంది. మోక్షజ్ఞను లాంచ్ చేయడానికి అనిల్ రావిపూడి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
    Published by:Suresh Rachamalla
    First published: