• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BALAKRISHNA HIMSELF STOPPING NANDAMURI MOKSHAGNA ENTRY INTO MOVIES AND HERE THE REASON PK

బాలకృష్ణ జాతకమే మోక్షజ్ఞ ఎంట్రీకి అడ్డు పడుతుందా..?

బాలకృష్ణ జాతకమే మోక్షజ్ఞ ఎంట్రీకి అడ్డు పడుతుందా..?

మోక్షజ్ఞ బాలయ్య (mokshagna balakrishna)

Mokshagna Nandamuri: నందమూరి వంశం నుంచి మూడో తరం వారసుడి కోసం అభిమానులు చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. అందులోనూ మాస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే బాలయ్య వారసుడు అంటే అంచనాలు..

  • Share this:
నందమూరి వంశం నుంచి మూడో తరం వారసుడి కోసం అభిమానులు చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. అందులోనూ మాస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే బాలయ్య వారసుడు అంటే అంచనాలు మరింత భారీగా ఉంటాయి. అయితే కొన్నేళ్లుగా ఈయన ఎంట్రీ కోసం ఆసక్తిగా అభిమానులు చూస్తున్నా కూడా వాళ్లకు నిరాశే ఎదురవుతూ వస్తుంది. తాజాగా మరోసారి కూడా బాలయ్య తన వారసుడి విషయంలో కుండబద్ధలు కొట్టేసాడు. 2021లో కూడా తన వారసుడి ఎంట్రీ ఉండదని చెప్పి ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. పైగా మోక్షు కూడా ఫిజిక్ పరంగా అస్సలు హీరోలా కనిపించడం లేదు. ఈయన ఇంకా చాలా మారాల్సిందే.

ఫ్యాట్ లుక్‌తో ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన మోక్షజ్ఞ (Twitter/Photo)
ఫ్యాట్ లుక్‌తో ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన మోక్షజ్ఞ (Twitter/Photo)


ఇలాంటి తరుణంలో బాలయ్య జాతకమే తన వారసుడి ఎంట్రీకి అడ్డుగా నిలిచిందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువగా జ్యోతిష్యం నమ్మేది బాలయ్య ఒక్కడే. తన సినిమాలకు ముహూర్తాలను కూడా ఫిక్స్ చేసుకుంటాడు. ఒక్కసారి బయటి హీరోలకు కూడా ముహూర్తాలు సెట్ చేస్తుంటాడు. అలాంటిది తన వారసుడి ఎంట్రీ కోసం జాతకం చూడకుండా ఉంటాడా..? అలాగే చూసాడు.. నందమూరి వంశం నుంచి వస్తున్న వారసుడు అంటూ అంచనాలు భారీగానే ఉంటాయి.

ఫ్యాట్ లుక్‌తో ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన మోక్షజ్ఞ (Twitter/Photo)
ఫ్యాట్ లుక్‌తో ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన మోక్షజ్ఞ (Twitter/Photo)


మరి వాటన్నింటినీ అందుకోవాలంటే కచ్చితంగా జాతకం కూడా కలవాల్సిందే.. ఇదే విషయాన్ని బాలయ్య కూడా ఒప్పుకున్నాడు. వారసుడి ఎంట్రీకి జ్యోతిష్యాన్ని కూడా చూసాడు బాలయ్య. అందుకే సరైన సమయంలోనే దించుతానని.. ఇప్పటికే మోక్షు కోసం నాలుగు కథలు కూడా సిద్ధం చేసానని తీపికబురు చెప్పాడు బాలకృష్ణ. అయితే అతడి జాతకం ప్రకారం మరో రెండేళ్లు ఆగాల్సిందే.

బాలకృష్ణతో మోక్షజ్ఞ (Nandamuri Mokshagna Balakrishna)
మోక్షజ్ఞ (Nandamuri Mokshagna)


అప్పటి వరకు నందమూరి అభిమానులకు ఎదురుచూపులు తప్పవు. కచ్చితంగా జ్యోతిష్కంలో అన్ని కలిసిన తర్వాతే అభిమానుల ముందుకు వారసుడు వస్తాడని చెప్పుకొచ్చాడు బాలయ్య. నందమూరి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన వాడు.. అందరి పేరు నిలబెట్టాల్సిన వాడు కాబట్టి కచ్చితంగా ఆ మాత్రం జాగ్రత్తలు ఉండాల్సిందే అంటున్నాడు బాలయ్య. మరి ఈయన నమ్మకాన్ని మోక్షజ్ఞ ఎంతవరకు నిలబెడతాడో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు