హోమ్ /వార్తలు /సినిమా /

Balakrishna - HariKrishna : అన్న హరికృష్ణ జయంతి సందర్భంగా బాలకృష్ణ ఎమోషనల్ పోస్ట్..

Balakrishna - HariKrishna : అన్న హరికృష్ణ జయంతి సందర్భంగా బాలకృష్ణ ఎమోషనల్ పోస్ట్..

హరికృష్ణతో బాలకృష్ణ (File/Photo)

హరికృష్ణతో బాలకృష్ణ (File/Photo)

Balakrishna - HariKrishna : అన్న హరికృష్ణ(HariKrishna) జయంతి సందర్భంగా బాలకృష్ణ (NBK Balakrishna) ఎమోషనల్ పోస్ట్ చేసారు

  Balakrishna - HariKrishna : అన్న హరికృష్ణ(HariKrishna) జయంతి సందర్భంగా బాలకృష్ణ (NBK Balakrishna) ఎమోషనల్ పోస్ట్ చేసారు. ఈ సందర్భంగా బాలయ్య (Balayya) అన్న  హరన్నను గుర్తు చేస్తూ పోస్ట్ చేసారు. హరన్న అంటే ధైర్యం, హరన్న అంటే ఆత్మవిశ్వాసం, హరన్న అంటే మొండితనం, హరన్న అంటే తెలుగుతనం, మా అన్న హరన్న జయంతి నేడు. ఈ రోజు ఆయన మా మధ్య లేకపోయినా.. మా మనసుల్లో ఆయన జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయన్నారు. మా హరన్న ఎక్కడ ఉన్న ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను అంటూ అన్న హరికృష్ణతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకొని  ఎమోషనల్ అయ్యారు బాలయ్య.

  ఇక హరికృష్ణ వర్థంతి 29 ఆగష్టు. ఆ రోజు కూడా బాలయ్య తన అన్నయ్య హరికృష్ణను సామాజిక మాధ్యమాల వేదికగా గుర్తు చేసుకున్న సంగతి తెలిసిందే కదా. అన్న అంటే అమ్మలో సగం, నాన్నలో సగం, అన్న అంటే మనకు మొదటి స్నేహితుడు. నా స్నేహితుడు, నా ఆప్తుడు, నా అన్న అంటూ హరికృష్ణ వర్థంతి సందర్భంగా బాలయ్య ఓ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా.

  ఈ  సందర్భంగా బాలయ్య తన హరికృష్ణ గురించి ఈ విధంగా ప్రస్తావించారు. మాకు పెద్దదిక్కుగా, ఒక పార్లమెంటు సభ్యుడిగా.. ఆయన లేని లోటు మాకు తీర్చలేనిది అంటూ...ఓ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా.

  ఇక హరికృష్ణ నిర్మాణంలో బాలయ్య పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ‘రౌడీ రాముడు కొంటె కృష్ణుడు’, ‘అనసూయమ్మ గారి అల్లుడు, ‘పట్టాభిషేకం’ వంటి పలు చిత్రాలను బాలయ్య హీరోగా హరికృష్ణ నిర్మించారు. ఇక బాలయ్యతో కలిసి హరికృష్ణ, ‘తాతమ్మ కల’, ‘రామ్ రహీమ్’, ‘దాన వీర శూర కర్ణ’ వంటి సినిమాల్లో నటించారు. ఇందులో ‘తాతమ్మ కల’, ‘దాన వీర శూర కర్ణ’ సినిమాల్లో తండ్రి ఎన్టీఆర్ కూడా నటించడం విశేషం.

  Harikrishna Birth Anniversary : నందమూరి హరికృష్ణ సినీ, రాజకీయ ప్రస్థానంలో కొన్ని ఆసక్తికర విషయాలు..


  1982లో తండ్రి తెలుగు దేశం పార్టీ స్థాపించినపుడు ఎన్టీఆర్ చైతన్య రథ సారథిగా పనిచేశారు. చైతన్య రథాన్ని 50 వేల కిలోమీటర్లు ఒక్కడే నడిపించారు. ఇక బాలకృష్ణ హీరోగా నటిస్తూ..  నిర్మాతగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాల్లో  బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తే.. ఆయన తనయుడు కళ్యాణ్ రామ్.. హరికృష్ణ పాత్రలో నటించారు.

  Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

  ఒక రకంగా తండ్రి పాత్రల్లో కుమారులు నటించడం అనే రేర్ ఫీట్ హీరోల్లో బాలయ్య, కళ్యాణ్ రామ్‌లకు దక్కిందనే చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. కానీ నందమూరి అభిమానులకు మాత్రం ‘ఎన్టీఆర్’ బయోపిక్ ఓ తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది.

  ఇక హరికృష్ణ తనయులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా తండ్రి 65వ  జయంతి సందర్భంగా ఎమోషనల్ ట్వీట్ చేసారు. ఈ అస్తిత్తవం మీరు. ఈ వ్యక్తిత్వం మీరు. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం వేరు.  ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరు. అంటూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సామాజిక మాధ్యమాల వేదికగా తండ్రి నందమూరి హరికృష్ణ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, Harikrishna, Jr ntr, NTR, Tollywood