హీరో అజిత్ పాటకి అదిరిపోయే స్టెప్పులు వేసిన బాలయ్య

హీరో బాలకృష్ణ ఓ ప్రైవేటు వేడుకలో అదరగొట్టాడు. హీరో అజిత్ నటించిన తమిళ సినిమా వేదాలంలోని ఫేమస్ సాంగ్ ఆలుమా.. డోలుమా.. సాంగ్‌కి తనదైన స్టైల్‌లో స్టెప్పులు వేసి అలరించాడు.

news18-telugu
Updated: November 28, 2019, 2:32 PM IST
హీరో అజిత్ పాటకి అదిరిపోయే స్టెప్పులు వేసిన బాలయ్య
ప్రైవేటు వేడుకలో బాలకృష్ణ డ్యాన్స్
  • Share this:
యాభై ఏళ్లు దాటినా తన హీరోయిజంతో, నటనతో, డైలాగులతో వెండితెరపై రికార్డులు సృష్టించే నందమూరి బాలకృష్ణ.. సరికొత్త గెటప్‌తో మనముందుకు రాబోతున్నాడు. రూలర్ సినిమా కోసం స్లిమ్‌గా మారిన ఆయన.. కొత్త లుక్‌తో అలరిస్తున్నాడు. అటు డ్యాన్సులతోనూ ఇరగదీసే బాలయ్య.. తాజాగా ఓ ప్రైవేటు వేడుకలో అదరగొట్టాడు. హీరో అజిత్ నటించిన తమిళ సినిమా వేదాలంలోని ఫేమస్ సాంగ్ ఆలుమా.. డోలుమా.. సాంగ్‌కి తనదైన స్టైల్‌లో స్టెప్పులు వేసి అలరించాడు. బాలయ్య డ్యాన్సు చేస్తున్నంత సేపు అక్కడున్నవారంతా ఈలలు వేస్తూ, గోల చేస్తూ ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

కాగా, బాలకృష్ణ నటించిన రూలర్ సినిమా డిసెంబరు 20న విడుదల కానుంది. కేఎస్ రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మువీలో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు నటసింహం. కొత్త లుక్‌లో కనిపించడంతో అభిమానులు ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

First published: November 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>