నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. విడుదలకు రెడీ అవుతోంది. దీంతో బాలయ్య తదుపరి సినిమాపై ఫోకస్ చేశారు. బాలకృష్ణ తన నెక్ట్స్ సినిమాను మరో మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్‌లో రాబోతున్న ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో బాలయ్య మరోసారి ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. అది అలా ఉంటే ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నటించే విషయంలో చాలా రూమర్స్ వచ్చాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఫైనల్ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా చాలా మంది పేర్లను పరిశీలించిన తర్వాత... శృతి హాసన్‌ను ఖరారు చేశారు గోపీచంద్. దీపావళి సందర్భంగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసింది చిత్రబృందం. గతంలో గోపీచంద్ డైరెక్ట్ చేసిన ‘క్రాక్’ సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకున్నారు శృతి. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉండనుందని తెలుస్తోంది. ఆ పాత్రలో భావన నటిస్తుందని టాక్.
ఇక ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ చేయబోతుండడంతో పాటు.. ఒక పాత్రలో స్వామీజీగా కనిపించనున్నారట. దీనికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమా కథలో మొత్తం రాయలసీమ, కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.
Team #NBK107 welcomes the highly talented and gorgeous @shrutihaasan on board to play the leading lady opposite #NandamuriBalakrishna Garu ?#HappyDiwali ?@megopichand @MusicThaman ❤️? pic.twitter.com/kjodDXaePk
— Mythri Movie Makers (@MythriOfficial) November 4, 2021
బాలయ్య గోపీచంద్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. గోపీచంద్ గతంలో డాన్ శీను, బలుపు, పండగ చేస్కో లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గత సంక్రాంతికి రవితేజ హీరోగా గోపీచంద్ దర్శకత్వంలో వచ్చిన క్రాక్ బాగా ఆకట్టుకుంది. ఈ కథలో బాలకృష్ణ ఓ పాత్ర కోసం ఫ్యాక్షన్ లీడర్ కనిపిస్తారని సమాచారం.
Arjun | Pushpa : వెయ్యి మంది డాన్సర్స్‌తో పుష్ప మాస్ సాంగ్ చిత్రికరణ.. ఫోటో వైరల్..
ఇక డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఏంతో ప్రతిష్టాత్మక వస్తున్న ‘అఖండ’ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రంలో బాలయ్య అఘోర పాత్రలో కనిపించనున్నారు. ఈ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను క్రిస్మస్‌కు విడుదల చేయాలనీ చూస్తోందట చిత్రబృందం. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం.
ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా వస్తోంది. ఈ సినిమా అన్ని అంచనాలుకి తగ్గట్టే అదిరే బిజినెస్ ని కూడా జరుపుకుంటోందని తెలుస్తోంది. ఈ చిత్రం నైజాం హక్కులు కూడా భారీ ధర పలికినట్టు టాక్ నడుస్తోంది. నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఏకంగా 19కోట్లకు కొనుగోలు చేశారని అంటున్నారు. ఆంధ్ర హక్కులు రూ. 35 కోట్ల రేషియోకు అమ్ముడయ్యాయి, ఇక సీడెడ్ రీజియన్ హక్కులు రూ .12 కోట్లకు అమ్ముడు పోయాయని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. అఖండలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది.
ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది. అఖండ షూటింగ్ పూర్తి అవ్వడంతో ఇక బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ద్వారక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Shruti haasan, Tollywood news