Home /News /movies /

BALAKRISHNA GOPICHAND MALINENI MOVIE ACTION KING ARJUN WILL PLAY CRUCIAL VILLAIN ROLE TA

Balakrishna - Gopichand Malineni : బాలకృష్ణ, గోపిచంద్ మలినేని సినిమాలో విలన్‌గా అల్లు అర్జున్ ఫాదర్..

బాలకృష్ణ,గోపీచంద్ మలినేని (Twitter/Photo)

బాలకృష్ణ,గోపీచంద్ మలినేని (Twitter/Photo)

Balakrishna - Gopichanda Malineni : బాలకృష్ణ, గోపిచంద్ మలినేని సినిమాలో అల్లు అర్జున్ ఫాదర్ ప్రతినాయకుడి పాత్రలో నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 

  Balakrishna - Gopichanda Malineni : బాలకృష్ణ, గోపిచంద్ మలినేని సినిమాలో అల్లు అర్జున్ ఫాదర్ ప్రతినాయకుడి పాత్రలో నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘అఖండ’ సక్సెస్‌తో ఇండస్ట్రీ బడా హీరోలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమా విడుదలై 4 వారాలు పూర్తి చేసుకొని ఐదో వారంలో అడుగు పెట్టింది. పెద్ద సినిమాలు రిలీజైతే.. ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారా రారా అన్న అనుమానాలు ‘అఖండ’ మాస్ జాతరతో  పటా పంచలైపోయాయి. దీంతో వరుసగా బడా సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. కానీ ఓమైక్రాన్ విస్తరణతో సినిమా రిలీజ్ డేట్స్ పై ఎఫెక్ట్ పడనుందా లేదా అనేది చూడాలి. ఆ సంగతి పక్కన పెడితే.. ‘అఖండ’ ప్రపంచ వ్యాప్తంగా రూ. 130 కోట్ల గ్రాస్ వసూళ్లతో దూకుడు మీదుంది. ఇక రూ. 71 కోట్ల షేర్‌తో ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తోంది.

  ‘అఖండ’ తర్వాత బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ఇంతలోనే బాలయ్యకు ‘అఖండ’ షూటింగ్‌లో గాయం కావడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం  ఆలస్యమైంది. ఈ సినిమాలో బాలయ్య సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా నటించబోతున్నట్టు సమాచారం.

  బాలకృష్ణను ఢీ కొట్టనున్న యాక్షన్ కింగ్ అర్జున్ (Twitter/Photo)


  యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగులో ‘లై’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ‘శ్రీ ఆంజనేయం’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’ వంటి చిత్రాలు అంతగా అలరించలేదు. ఇపుడు రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఖిలాడి’లో ఈయన విలన్‌గా నటిస్తున్నారు.  బాలయ్య సినిమాలో విలన్‌గా నటించిన జగపతి బాబు, శ్రీకాంత్ విలన్స్‌గా జోరు చూపిస్తున్నారు. ఇపుడు బాలయ్య సినిమాలో విలన్‌గా నటించి అర్జున్ .. హిట్ ట్రాక్ ఎక్కి విలన్‌గా సెట్ అయిపోతారా లేదా అనేది చూడాలి.

  Tollywood Top Movies 2021 : అఖండ,వకీల్ సాబ్,పుష్ప సహా 2021లో టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు..


  యాక్షన్ కింగ్ అర్జున్ విషయానికొస్తే.. నిన్న మొన్నటి వరకు తమిళం, కన్నడ, తెలుగులో అగ్ర స్థాయి  యాక్షన్ హీరోగా అదరగొట్టారు. ఈయనకు తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మంచి స్టోరీలతో హీరోగా సినిమాలు చేస్తే చూసే ప్రేక్షకులున్నారు. ఈయన సడెన్‌గా విలన్ పాత్రలు చేస్తుండంపై ఆయన అభిమానులు ఒకింత గుర్రుగా ఉన్నారు. ఏమైనా నటుడిగా ఒక పాత్రకు పరిమితం కాకుండా విభిన్న పాత్రల్లో అలరించే ప్రయత్నం చేస్తున్నారు అర్జున్.

  బాలకృష్ణ, అర్జున్ (Twitter/Photo)


  ప్రస్తుతం బాలయ్య.. సినిమాలతో పాటు ‘ఆహా’ ఓటీటీ కోసం యాంకర్ అవతారం ఎత్తి సినిమా సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ షోకు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఆహాలో అత్యధిక వ్యూస్ తీసుకొస్తున్న షోగా ఇది రికార్డులు తిరగరాస్తుంది. పైగా బాలయ్య హోస్టింగ్ కూడా కేక పెట్టిస్తుంది. తనను తాను చాలా మార్చుకున్నారు బాలయ్య.

  Shyam Singha Roy - Nani : శ్యామ్ సింగరాయ్ మూవీపై వివాదం.. అందులోని ఓ సన్నివేశంపై హిందూ సంఘాల ఆగ్రహం..


  ముఖ్య కంటే  తనకంటే తక్కువ ఇమేజ్ ఉన్న నటులు వచ్చినపుడు కూడా ఎంతో బాగా రిసీవ్ చేసుకోవడమే కాకుండా.. వాళ్లపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.ఇక బాలయ్య  చేతికి గాయం మరో రెండు వారాల్లో పూర్తిగా తగ్గిన తర్వాత సంక్రాంతి తర్వాత జనవరి 20 నుంచి గోపీచంద్ మలినేని సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాను కేవలం రెండు షెడ్యూల్లలో కంప్లీట్ చేయనున్నారట. ఈ సినిమా బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. మరో కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. ఇంకో కథానాయికగా భావన నటిస్తున్నట్టు సమాచారం. విజయ శాంతి కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

  Year Ender 2021 : వకీల్ సాబ్, తిమ్మరుసు, జై భీమ్ సహా ఈ ఇయర్ ప్రేక్షకులను మెప్పించిన కోర్టు డ్రామా మూవీస్..


  ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్టు సమాచారం. ఒక పాత్ర ఫ్యాక్షనిస్ట్ పాత్ర అయితే.. మరోకటి పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర అని చెబుతున్నారు. ‘చెన్నకేశవరెడ్డి’ తరహాలో తండ్రి కొడుకులు నేపథ్యంలో ఈ సినిమాను పలనాడు బ్యాక్‌డ్రాప్‌లో నిజ జీవిత ఘటలన ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు వేట పాలెం’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Action King Arjun, Balakrishna, Gopichand malineni, NBK 107, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు