హోమ్ /వార్తలు /సినిమా /

Balakrishna : బాలయ్య గోపిచంద్ సినిమాకు అంతా రెడీ.. అదోక్కటే సమస్య..

Balakrishna : బాలయ్య గోపిచంద్ సినిమాకు అంతా రెడీ.. అదోక్కటే సమస్య..

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నారు

  నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన మొన్నటి వరకు శృతి హాసన్ నటిస్తుందని టాక్ నడించింది. అంతేకాదు ఆమె కూడా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుందని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం మేరకు శృతి హాసన్ వివిధ సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమాలో నటించడానికి వీలుకాదని సున్నింతగా తిరస్కరించదట. ఈ సినిమాలో కథ ప్రకారం ఇద్దరు హీరోయిన్స్‌కు ఛాన్స్ ఉందట. ఇక మరో హీరోయిన్‌గా రకుల్‌ను సంప్రదించగా.. ఆమె కూడా నో చెప్పిందని తెలుస్తోంది. దీనిపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ సమస్య మన టాలీవుడ్ సీనియర్ హీరోలకు ఎప్పటినుంచో ఉంది. వీళ్లు ఏ కొత్త సినిమా మొదలుపెట్టినా ఇదే మొదటి సమస్య మారింది. బాలయ్య అఖండ సినిమాకు ఇదే పెద్ద సమస్యగా మారింది. ఈ సినిమా విషయంలో కూడా చాలా మంది పేర్లు వినపడ్డాయి. చివరకు ప్రగ్యా జస్వాల్‌ను చిత్రబృందం ఫైనల్ చేసింది. ఇప్పుడు తాజాగా బాలకృష్ణ మొదలుపెట్టనున్న కొత్త చిత్రానికి ఇదే ప్రాబ్లమ్ అయింది. ఓ వైపు శృతి హాసన్, మరోవైపు రకుల్ తమ సినిమాలతో బిజీగా ఉన్నామని తెలపడంతో గోపిచంద్ మలినేని మళ్లీ కొత్త హీరోయిన్లను అప్రోచ్ అయ్యే పనిలో ఉన్నారట. మరి చివరకు బాలయ్యకు జోడీగా ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.

  ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న ‘అఖండ’ పూర్తికాగానే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఈ కొత్త సినిమా మొదలుకానుంది. గోపీచంద్ మలినేని బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసినట్లు సమాచారం. ఈ సినిమా యాధార్థ ఘటనల ఆధారంగా ఉండనుందట. ఈ కథలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తారని సమాచారం.  ఇక అఖండ విషయానికి వస్తే.. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అఖండ మే 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలకానుందని తెలుస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ డ్యుయల్ రోల్ చేస్తున్నారు. అందులో భాగంగా ఒక పాత్రలో బాలయ్య అఘోరా లుక్ లో కనిపిస్తారని సమాచారం. ఇక ఈ సినిమాకు బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని హాట్ స్టార్ సంస్థ దక్కించుకుందని సమాచారం. అందులో భాగంగా స్ట్రీమింగ్ రైట్స్ కోసం ఏకంగా 9 నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయని సమాచారం. అంతేకాదు ఈ అఖండ సినిమా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ఫిగర్స్ టచ్ చెయ్యనున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇక ఇటీవల విడుదలైన అఖండ టీజర్ 54 మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.

  First published:

  Tags: Balakrishna, Rakul Preet Singh, Shruthi haasan, Tollywood news

  ఉత్తమ కథలు