• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BALAKRISHNA GOPICHAND MALINENI FILM UPDATE KRACK ACTRESS SHRUTI HAASAN REJECTS THE BALAYYA FILM HERE ARE THE DETAILS SR

Balakrishna : బాలయ్య గోపీచంద్ సినిమాకు హీరోయిన్ కష్టాలు.. శృతి హాసన్ నో చెప్పిందా..

Balakrishna : బాలయ్య గోపీచంద్ సినిమాకు హీరోయిన్ కష్టాలు.. శృతి హాసన్ నో చెప్పిందా..

Balakrishna Nandamuri Gopichand Malineni Photo : Twitter

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే.

  • Share this:
    నందమూరి నటసింహం బాలకృష్ణ క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఉప్పెనతో ఖతర్నాక్ విజయాన్ని అందుకుని ఊపు మీదున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. గోపీచంద్ మలినేని బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న గోపీచంద్ మలినేని బాలయ్య సరసన నటించే నటితో పాటు లీడ్ యాక్టర్స్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడట. ఈ సినిమా బోయపాటి సినిమా తర్వాత మొదలుకానుంది. అయితే దర్శకుడు గోపీచంద్ హీరోయిన్ విషయంలో కొంత ఇబ్బందులు పడుతున్నాడని సమాచారం. బాలయ్య స్టేచర్‌కు తగ్గట్లు ఈ సినిమాలో నటించడానికి ఓ హీరోయిన్ కోసం చూస్తున్నాడట గోపీచంద్. అందులో భాగంగా రవితేజ సరసన నటించి అదరగొట్టిన క్రాక్ హీరోయిన్ శ‌ృతి హాసన్‌ అయితే బాగుంటుందని భావించిన గోపీచంద్.. ఆమెను సంప్రదించాడట. కాగా శృతి హాసన్ సున్నితంగా ఈ సినిమాకు నో చెప్పిందని సమాచారం.

    దీనికి కారణం లేకపోలేదు. శృతి హాసన్ తెలుగులో ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సలార్‌లో నటిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ సినిమా కోసం శృతి హాసన్ బల్క్ డేట్స్ ఇచ్చిందట. దీంతో డేట్స్ సర్దుబాటు చేయలేక బాలయ్య సినిమా ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించదని టాక్.

    ఇక బాలయ్య ప్రస్తుతం చేస్తున్న బోయపాటి సినిమాకు కూడా చాలా మందిని పరిశీలించి చివరకు వరుణ్ తేజ్ 'కంచె' ఫేమ్ ప్రగ్యా జైస్వాల్, మరో నటి పూర్ణ ఫైనల్ చేశారు. ఇక కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఈ సినిమాకు టైటిల్స్ గా గతంలో మోనార్క్, డేంజర్ అని ప్రచారంలో ఉన్నాయి. కాగా తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాకు ఫైనల్ గా గాడ్ ఫాదర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిందట చిత్రబృందం. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. గాడ్ ఫాదర్ మే 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.



    ఇక ఈ సినిమాలో బాలకృష్ణ డ్యుయల్ రోల్ చేస్తున్నాడు. అందులో భాగంగా ఒక పాత్రలో బాలయ్య అఘోరా లుక్ లో కనిపిస్తారని సమాచారం. ఇక ఈ సినిమాకు బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించునేందుకు ప్రయత్నిస్తోందట. అందులో భాగంగా స్ట్రీమింగ్ రైట్స్ కోసం అమెజాన్ ఏకంగా 9 నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయని సమాచారం. అంతేకాదు ఈ గాడ్ ఫాదర్ సినిమా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ఫిగర్స్ టచ్ చెయ్యనున్నట్టుగా సమాచారం అందుతోంది.
    Published by:Suresh Rachamalla
    First published: