news18-telugu
Updated: November 29, 2020, 10:24 AM IST
బాలకృష్ణ Photo : Twitter
బాలయ్య వెండితెర అమ్మ హేమా మాలిని మరోసారి అమ్మమ్మ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఒకప్పటి వెటరన్ యాక్టర్ హేమా మాలిని, ధర్మేంద్రలు మరోసారి తాత, అమ్మమ్మలయ్యారు. వీళ్ల రెండో కూతురు అహనా డియోల్ వోహ్రా ఈ నెల 26న ఇద్దరు ఆడ కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అహానా ఆమె భర్త వైభవ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాదు వారికి అస్త్రేయ వోహ్రా, ఆదియా వోహ్రా అనే పేర్లను కూడా పెట్టేసారు. ఒకేసారి ఇద్దరు పిల్లలు కలగడంతో అహానా ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. మరోవైపు హేమా మాలిని, ధర్మేంద్రలు కూడా కవల మనవరాళ్లను చూసి ఆనంద పడుతున్నారు. ఆహనా, వైభవ్ దంపతులకు గతంలో 2015లో ఓ బిడ్డకు జన్మినిచ్చారు.
అతనికి డేరియన్ వోహ్రా అని పేరు పెట్టారు. వీరి పెళ్లి 2 ఫిబ్రవరి 2014లో జరిగింది. హేమా మాలిని కూడా లోక్ సభ సభ్యురాలిగా తీరికా లేకుండా ఉన్న డేరియన్తో పాటు తన మొదటి కూతురు ఈషా డియోట్ పిల్లలైన రాధ్యా, మిరాయ కోసం తన టైమ్ స్పెండ్ చేస్తోంది.

మరోసారి అమ్మమ్మ అయిన హేమా మాలని (Twitter/Photo)
హేమా మాలిని విషయానికొస్తే.. బాలీవుడ్లో ఈమెకు ప్రత్యేక స్థానం ఉంది . నటిగా, నర్తకిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, రచయిత్రిగా, ఓ పత్రిక సంపాదకురాలిగా తనదైన బాణీ పలికించిన హేమామాలిని ప్రస్తుతం... పార్లమెంట్ సభ్యురాలిగానూ రాణిస్తున్నారు.1965లో విడుదలైన 'పాండవ వనవాసం' పౌరాణిక చిత్రంలో హేమ తనదైన ఆటపాటతో కనువిందు చేసింది.
బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాజ్యమేలుతున్నా హేమా మాలిని తెలుగులో మరోసారి 'శ్రీకృష్ణవిజయం' అనే చిత్రంలో నటించి తన నాట్యంతో మురిపించింది. ఇక 1980లో తోటి నటుడు ధర్మేంద్రను ప్రేమ వివాహం చేసుకున్న హేమా మాలిని అక్కడే స్ధిర పడిపోయింది. ఆ తర్వాత చాలా యేళ్లకు బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాలో బాలయ్య తల్లైన గౌతమిగా టైటిల్ రోల్ ప్లే చేసింది హేమా మాలిని. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే సాధించింది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 29, 2020, 10:24 AM IST