హోమ్ /వార్తలు /సినిమా /

బోయపాటి సినిమా కోసం ఎన్టీఆర్ రూట్లో వెళుతున్న బాలయ్య..

బోయపాటి సినిమా కోసం ఎన్టీఆర్ రూట్లో వెళుతున్న బాలయ్య..

బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR Balakrsihna)

బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR Balakrsihna)

గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని బాలకృష్ణ.. ఇపుడు బోయపాటి శ్రీనుతో చేస్తోన్న సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసి మీదున్నాడు. ఈ సినిమా కోసం బాలకృష్ణ.. అబ్బాయి ఎన్టీఆర్‌ను ఫాలో కావాలని ఫిక్స్ అయ్యాడు.

  గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని బాలకృష్ణ.. ఇపుడు బోయపాటి శ్రీనుతో చేస్తోన్న సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసి మీదున్నాడు. అందుకే ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టి చాలా రోజులైనా.. ఎక్కడ తొందరపడకుండా.. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో అన్నీ ఓకే అనుకున్నాకే ఈ సినిమాను ఈ  రోజునే పట్టాలెక్కించారు. ఈ సినిమా కోసం బాలకృష్ణ.. అబ్బాయి ఎన్టీఆర్‌ను ఫాలో కావాలని ఫిక్స్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్.. అప్పట్లో బి.గోపాల్ దర్శకత్వంలో ‘నరసింహుడు’ సినిమా చేసాడు. ఈ చిత్రంలో జూనియర్ ఇంటర్వెల్ వరకు ఎలాంటి డైలాగులు ఉండవు. తాజాగా బాలకృష్ణ కూడా బోయపాటి శ్రీను సినిమాలో ఎలాంటి డైలాగులు లేకుండా నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో బాలయ్య.. అఘోరాగా, ఫ్యాక్షనిస్ట్‌గా రెండు విభిన్న పాత్రల్లో నటించబోతున్నట్టు సమాచారం. కొన్ని నిమిషాల వ్యవధిలో పుట్టిన కవలలు జీవితంలో నవగ్రహాలు ఎలాంటి ప్రభావం చూపించిందన్న దానిపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట.

  45 ఏళ్ల సినీ కెరీర్‌లో నందమూరి బాలకృష్ణ మొదటిసారి అలా చేయబోతున్నాడు. ఇది చూసి అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే...
  బాలకృష్ణ,బోయపాటి శ్రీను సినిమా ప్రారంభోత్సవం (Twitter/Photo)

  ఇక అఘోర పాత్ర విషయంలో ఆయనకు ఇంటర్వెల్ వరకు ఎలాంటి డైలాగులు ఉండవని చెబుతున్నారు. ఆధ్యాత్మికతతో కూడిన ఈ అఘోర పాత్ర చాలా వైవిధ్యంగా ఉండి బాలయ్య కొత్తగా కనిపిస్తూ అలరించనున్నాడట. ఇక ఈ సినిమా కోసం చాలా మందిని పరిశీలించి చివరకు హీరోయిన్‌గా అంజలిని తీసుకున్నారు. అలాగే సినీయర్ భామ శ్రియ సరన్‌ను కూడా ఓ కీలక పాత్ర కోసం తీసుకోవాలని చిత్రబృందం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ ఏ హీరో చేయనటువంటిదిగా తన పాత సూపర్ హిట్ ‘బంగారు బుల్లోడు’ సినిమాలో ఉన్న ‘స్వాతిలో ముత్యమంత’ పాటను తమన్‌తో రీమిక్స్ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు చాలా మంది వేరే హీరోల సూపర్ హిట్ పాటలను రీమిక్స్ చేయడం చూసాము. కానీ బాలకృష్ణ మాత్రం తన పాత సూపర్ హిట్ సినిమాలోని పాటను రీమిక్స్ చేయడం విశేషం. అంతేకాదు ఈ సినిమాకు బాలకృష్ణ.. పాత సూపర్ హిట్ సినిమా టైటిల్‌నే పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మొత్తానికి బోయపాటి శ్రీను సినిమా కోసం బాలయ్య.. జూనియర్ ఎన్టీఆర్‌ను ఈ రకంగా ఫాలో కావడం పెద్ద విచిత్రమే అని మాట్లాడుకుంటున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, Balayya, Boyapati Srinu, Jr ntr, NBK, NBK 106, Rajamouli, RRR, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు