నాగబాబు స్థాయి ఎంత.. విమర్శలపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..

బాలయ్యకు నాగబాబు కౌంటర్ (naga babu balakrishna)

Balakrishna Vs Naga Babu: బాలయ్యపై నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఈయన కామెంట్స్‌తో మరోసారి మెగా నందమూరి కంపౌండ్స్ మధ్య ఉన్న వైరం బయటికి వచ్చింది.

  • Share this:
బాలయ్యపై నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఈయన కామెంట్స్‌తో మరోసారి మెగా నందమూరి కంపౌండ్స్ మధ్య ఉన్న వైరం బయటికి వచ్చింది. బయటికి అంతా ఒక్కటే అని చెప్పుకుంటున్నా కూడా లోపల మాత్రం గ్రూపు రాజకీయాలు బాగానే నడుస్తున్నాయని మరోసారి తేట తెల్లమైంది. దానికితోడు నీ యిష్టమొచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ చూస్తూ కూర్చోడానికి ఎవరూ లేరు.. మీరు కింగ్ కాదు జస్ట్ హీరో అంతే.. ఎవర్ని ఎప్పుడు ఎక్కడికి పిలవాలో అందరికీ తెలుసు అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అయితే ఈయన చేసిన కామెంట్స్ నందమూరి అభిమానులు అస్సలు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.

నాగబాబు (Twitter/Nagababu)
నాగబాబు (Twitter/Nagababu)


పైగా ఇండస్ట్రీలోనే కొందరు నాగబాబుపై సెటైర్లు వేస్తున్నారు. ప్రసన్న కుమార్, నట్టి కుమార్ లాంటి వాళ్లు నాగబాబుపై సీరియస్ అయ్యారు. అసలు బాలయ్య రేంజ్ ఏంటి.. నాగబాబు స్థాయేంటి.. ఆయనొచ్చి ఈయన్ని కామెంట్ చేయడం ఏంటి.. అసలు ఏమైనా బాగుందా ఇది అంటూ నాగబాబును తీసి పారేసినట్లు మాట్లాడారు. ఇక బాలయ్య ఫ్యాన్స్ కూడా నాగబాబుని లైట్ తీసుకుంటున్నారు. అనవసరంగా స్పందించి నాగబాబు రేంజ్ పెంచడం తమకు యిష్టం లేదని.. అయినా బాలయ్యను అనే స్థాయి నాగబాబుకు ఎక్కడుంది అంటూ సీరియస్ అవుతున్నారు.

చిరంజీవి, బాలకృష్ణ (Chiranjeevi Vs Balakrishna)
చిరంజీవి, బాలకృష్ణ (Chiranjeevi Vs Balakrishna)


బాలయ్య అన్నది చిరంజీవి, నాగార్జునతో పాటు టిఆర్ఎస్ ప్రభుత్వాలను అయితే మధ్యలో నాగబాబు నోరు ఎందుకు లేస్తుందని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. గాడ్సే దేశభక్తుడని తెలిసిన నాగబాబుకు ఇండస్ట్రీలో జరిగే సీక్రెట్ వ్యవహారాల గురించి తెలియవా.. తెలియకుండా ఉంటుందా.. వాటినే కదా ఇప్పుడు మా బాలయ్య ప్రశ్నించాడు.. దమ్ముంటే సమాధానం చెప్పాలి కానీ ఇలా విమర్శిస్తే ఎలా అంటూ వాళ్లు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.

బాలకృష్ణ (Balakrishna/Photo)
బాలకృష్ణ (Balakrishna/Photo)


ఇప్పటికీ అన్నతమ్ముడు పేరు చెప్పుకుని బతికే నాగబాబుకు బాలయ్యను విమర్శించే ధైర్యం వచ్చిందా.. ఆయన్నే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమని చెప్పేంత దమ్ముందా అంటూ బాలయ్య ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. గతేడాది కూడా బాలయ్య ఎవరో నాకు తెలియదంటూ నానా రచ్చ చేసాడు నాగబాబు. ఇప్పుడు మరోసారి ఈ మ్యాటర్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published: