హోమ్ /వార్తలు /సినిమా /

NBK Nartanasala: ‘నర్తనశాల’ టికెట్ 10 లక్షలు.. బాలకృష్ణ అభిమానులా మజాకా..

NBK Nartanasala: ‘నర్తనశాల’ టికెట్ 10 లక్షలు.. బాలకృష్ణ అభిమానులా మజాకా..

బాలయ్య నర్తనశాల (Balakrishna Nartanasala)

బాలయ్య నర్తనశాల (Balakrishna Nartanasala)

Balakrishna Nartanasala: తెలుగు ఇండస్ట్రీలో అందరు హీరోలకు అభిమానులున్నారు కానీ బాలయ్యకు మాత్రం ఆ అభిమానం కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆయన అభిమానులకు అతడే దేవుడు.. బాలయ్య ఏం చేసినా అద్భుతమే.

తెలుగు ఇండస్ట్రీలో అందరు హీరోలకు అభిమానులున్నారు కానీ బాలయ్యకు మాత్రం ఆ అభిమానం కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆయన అభిమానులకు అతడే దేవుడు.. బాలయ్య ఏం చేసినా అద్భుతమే. అందుకే ఆయన సినిమాలు వస్తున్నపుడు ఉండే హంగామా వేరుగా ఉంటుంది. ముఖ్యంగా బాలయ్య చుట్టూ ఏదో తెలియని ఓ మాస్ హిస్టీరియా ఉంటుంది. ఆయన్ని అభిమానించే వాళ్లు కూడా బాలయ్యను దేవుడిగా చూస్తుంటారు. కొట్టినా తిట్టినా ఏం చేసినా అదో మహాప్రసాదం అంటారు. అతడి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నపుడు టికెట్స్ కొనే విధానం కూడా అలాగే ఉంటుంది. ముఖ్యంగా బాలయ్య సినిమాల కోసం లక్షలకు లక్షలు పోసి తొలి టికెట్ కొంటుంటారు ఫ్యాన్స్. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా ఈయన నర్తనశాల సినిమాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నాడు. ఎప్పుడో 17 ఏళ్ళ కింద ఈ సినిమాను మొదలుపెట్టి 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలు చిత్రీకరించాడు. ఇందులో అర్జునుడిగా బాలయ్య.. భీముడిగా శ్రీహరి.. ద్రౌపదిగా సౌందర్య నటించారు.

బాలయ్య నర్తనశాల (Balakrishna Nartanasala)
బాలయ్య నర్తనశాల (Balakrishna Nartanasala)

సౌందర్య మరణంతో అప్పుడు ఆగిపోయిన ఈ సినిమాను ఇప్పుడు విడుదల చేస్తున్నాడు బాలయ్య. శ్రేయాస్ ఈటీతో కలిసి ఎన్‌బికే థియేటర్‌లో దసరాకు విడుదల చేస్తున్నాడు ఈయన. దీనికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టాడు బాలయ్య. దీని కనీస ధర 50 రూపాయలుగా నిర్ణయిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే బాలయ్య అభిమానులు కొందరు ఈ చిత్ర టికెట్‌ను ఏకంగా 10 లక్షలు పెట్టి కొంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

నర్తనశాలలో భీముడిగా శ్రీహరి లుక్ (Twitter/Photo)
నర్తనశాలలో భీముడిగా శ్రీహరి లుక్ (Twitter/Photo)

గతంలో కూడా ఇది జరిగింది. లెజెండ్, ఎన్టీఆర్ లాంటి సినిమాలకు లక్షలకు లక్షలు పోసి టికెట్స్ కొన్నారు అభిమానులు. ఇప్పుడు కూడా నర్తనశాల విషయంలో ఇదే జరుగుతుంది. ఈ సినిమా నుంచి వచ్చిన డబ్బును ఛారిటీ కోసం వాడతానని చెప్పాడు బాలయ్య. దాంతో మంచి పని కోసం బాలయ్య చేస్తున్న ఈ పనికి సాయంగా నిలుస్తున్నారు అభిమానులు. 10 లక్షలు పెట్టి టికెట్ కొన్న అభిమానుల పేర్లను త్వరలోనే స్వయంగా బాలయ్య ప్రకటించబోతున్నాడు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Balakrishna, NBK Nartanasala, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు