హోమ్ /వార్తలు /సినిమా /

Balakrishna | NTR : అఖండ ప్రిరిలీజ్ వేడుకలో ఎన్టీఆర్‌పై బాలయ్య కామెంట్స్.. వీడియో వైరల్..

Balakrishna | NTR : అఖండ ప్రిరిలీజ్ వేడుకలో ఎన్టీఆర్‌పై బాలయ్య కామెంట్స్.. వీడియో వైరల్..

Kalyan Ram, Balakrishna, NTR Photo : Twitter

Kalyan Ram, Balakrishna, NTR Photo : Twitter

Balakrishna | NTR : ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ తాజాగా నవంబర్ 27న హైదరాబాద్ శిల్ప కళా వేదికలో గ్రాండ్‌గా జ‌రిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు అల్లు అర్జున్‌తో పాటు రాజమౌళి గెస్ట్‌లుగా వచ్చారు. దీంతో ఇటు నందమూరి అభిమానులతో పాటు అల్లు అర్జున్ అభిమానులు హాజరై అదరగొట్టారు.

ఇంకా చదవండి ...

    నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటిస్తుండగా, థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ కాబోతుంది. విడుదల తేది దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది చిత్రబృందం. అందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ తాజాగా నవంబర్ 27న హైదరాబాద్ శిల్ప కళా వేదికలో గ్రాండ్‌గా జ‌రిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు (Allu Arjun) అల్లు అర్జున్‌తో పాటు రాజమౌళి గెస్ట్‌లుగా వచ్చారు. దీంతో ఇటు నందమూరి అభిమానులతో పాటు అల్లు అర్జున్ అభిమానులు హాజరై అదరగొట్టారు.

    ఇక అది అలా ఉంటే ఈవెంట్‌లో బాల‌కృష్ణ జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాలయ్య అఖండ ప్రిరిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ మన తమ్ముడు రామ్ చరణ్, మ‌న జూనియర్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న (RRR) ఆర్ఆర్ఆర్ చిత్రంతోపాటు అల్లు అర్జున్ న‌టిస్తోన్న పుష్ప‌, చిరంజీవి న‌టిస్తోన్న ఆచార్య‌ చిత్రాలే కాకుండా.. సినిమాలు చిన్నవైనా పెద్దవైనా ఆద‌రించాల‌ని కోరారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎప్పుడైతే బాల‌య్య నోట ఎన్టీఆర్ పేరు వినిపించిందో.. శిల్ప క‌ళావేదిక ప్రాంగ‌ణమంతా ఒక్కసారిగా ద‌ద్ద‌రిల్లిపోయింది. అభిమానులు అరుపులు, కేక‌ల‌తో రచ్చ చేశారు.

    Raashi Khanna : రెడ్ టాప్‌లో వావ్ అనిపించిన అందాల రాశీ ఖన్నా..

    ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఓ రెండు పాటలను విడుదల చేసిన టీమ్.. తాజాగా ట్రైలర్‌ను వదిలింది. ట్రైలర్ ఓ రేంజ్‌లో ఉందని చెప్పోచ్చు.. బాలయ్య డైలాగ్స్‌తోడు మేకోవర్ అదిరిపోయింది. దీంతో నెటిజన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నవంబర్ 14న సాయంత్రం 7:09 గంటలకు విడుదలైన సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. లైక్స్ పరంగా వ్యూస్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మిర్యాల రవిందర్ రెడ్డి మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఈ సినిమాకి అఖండ అనే టైటిల్ ఫిక్స్ చేయకముందు మహర్జాతకుడు అనే టైటిల్‌ను అనుకున్నారట.

    ఈ సినిమా తాజాగా సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకుంది. అఖండకు U/A సర్టిఫికేట్ వచ్చినట్లు చిత్రబృందం ప్రకటించింది. అంతేకాదు రన్ టైమ్ కూడా తెలిసింది. ఈ సినిమా రెండు గంటల 47 నిమిషాల నిడివితో విడుదలకానుందని అంటున్నారు. ఇక దీపావళి సందర్భంగా ఈ చిత్రం నుంచి విడుదలైన భం అఖండ‌, భంభం అఖండ ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్‌లో పాట ఫ్యాన్స్‌కు పూనకాలనే తెస్తుందని అంటున్నారు నెటిజన్స్.  థమన్ (Thaman) మ్యూజిక్‌తో పాటు లిరిక్స్ కూడా అదిరిపోయాయి. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. శంకర్ మహా దేవన్ పాడారు. నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఏకంగా 19కోట్లకు కొనుగోలు చేశారని అంటున్నారు. ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా మొత్తం ఆంధ్ర హక్కులు రూ. 35 కోట్ల రేషియోకు అమ్ముడయ్యాయి, ఇక సీడెడ్ రీజియన్ హక్కులు రూ .12 కోట్లకు అమ్ముడు పోయాయని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

    Vijay Devarakonda | Liger : లాస్ ఏంజెల్స్‌లో విజయ్ దేవరకొండ.. ఇద్దరమ్మాయిలతో హల్ చల్.. పిక్స్ వైరల్..

    బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా వస్తోంది. ఈ సినిమా అన్ని అంచనాలుకి తగ్గట్టే అదిరే బిజినెస్ ని కూడా జరుపుకుంటోందని తెలుస్తోంది. ఈ చిత్రం నైజాం హక్కులు కూడా భారీ ధర పలికినట్టు టాక్ నడుస్తోంది.

    ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన విడుదలైంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ద్వారక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అఖండ పూర్తవ్వడంతో బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టారు. క్రాక్ డైరక్టర్ గోపీచంద్‌  (Gopichand)దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. బాలయ్య గోపీచంద్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. త్వరలో షూటింగ్ మొదలుకానుంది. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించనుంది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter, and Google News)

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Akhanda movie, Balakrishna, NTR, Tollywood news