బాలయ్యకు సపోర్ట్‌గా కొందరు.. విమర్శిస్తూ మరికొందరు..

Balakrishna: తెలుగు ఇండస్ట్రీలో జరుగుతున్న మీటింగ్స్‌పై బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అసలు ఏ ఉద్దేశ్యంతో ఈ కామెంట్స్ చేసాడంటూ కొందరు ఈయనపై నేరుగానే విమర్శల వర్షం..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 29, 2020, 2:30 PM IST
బాలయ్యకు సపోర్ట్‌గా కొందరు.. విమర్శిస్తూ మరికొందరు..
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో జరుగుతున్న మీటింగ్స్‌పై బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అసలు ఏ ఉద్దేశ్యంతో ఈ కామెంట్స్ చేసాడంటూ కొందరు ఈయనపై నేరుగానే విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నాగబాబు లాంటి వాళ్లైతే ఏకంగా వార్నింగులు కూడా ఇచ్చేస్తున్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి.. మీరు అంటే పడటానికి ఇక్కడెవ్వరూ లేరంటూ బాగానే సీరియస్ అయ్యాడు మెగా బ్రదర్. ఇదిలా ఉంటే సి కళ్యాణ్ కూడా బాలయ్యకు వ్యతిరేకంగానే మాట్లాడాడు. ఆయన కామెంట్స్ కొందరిని బాధ పెట్టాయంటూ చెప్పుకొచ్చాడు.

బాలయ్యకు నాగబాబు కౌంటర్ (naga babu balakrishna)
బాలయ్యకు నాగబాబు కౌంటర్ (naga babu balakrishna)


బాలయ్యకు తను జరిగిందంతా వివరించినట్లు చెప్పినా కూడా ఆయన మాత్రం ఇంకా అర్థం చేసుకున్నట్లు అయితే కనిపించడం లేదు. తమ్మారెడ్డి భరద్వాజ్ సైతం బాలయ్యనే తప్పు పట్టాడు. అక్కడ జరిగింది నిర్మాతల సమావేశం కాబట్టి వాళ్లంతా వచ్చారు.. బాలయ్యను ఎప్పుడు పిలవాలో తెలుసని కామెంట్ చేసాడు. ఇదిలా ఉంటే మరికొందరు మాత్రం బాలయ్యకు సపోర్ట్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఆయన పెద్ద హీరో.. నిర్మాత.. స్టూడియోలు ఉన్నాయి.. అలాంటి వ్యక్తిని మీటింగ్‌కు పిలవకుండా ఏం చేస్తున్నారు.. అది తప్పు కాదా ఆయన అన్నదాంట్లో తప్పేంటి అని అడుగుతున్నారు.

బాలకృష్ణ (Balakrishna Nandamuri/Photo)
బాలకృష్ణ (Balakrishna Nandamuri/Photo)


ప్రసన్న కుమార్, నట్టి కుమార్ లాంటి నిర్మాతలు బాలయ్యకు సపోర్ట్ చేస్తున్నారు. బయటికి కనిపించకపోయినా కూడా మరికొందరు ప్రముఖులు కూడా బాలయ్యను సమర్థిస్తున్నారు. నిజంగానే రియల్ ఎస్టేట్ చేస్తున్నారా.. లేదంటే ఆ నలుగురు థియేటర్స్ కోసమే ఈ మీటింగులు పెట్టారా అంటూ నట్టి కుమార్ లాంటి వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తున్న తర్వాత లేనిపోని అనుమానాలు అయితే అందర్లోనూ వస్తున్నాయి. మరి దీనిపై బాలయ్య మరోసారి మాట్లాడతాడా.. క్లారిటీ ఇస్తాడా లేదా చూడాలి.
First published: May 29, 2020, 2:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading