హోమ్ /వార్తలు /సినిమా /

బాలకృష్ణ,బోయపాటి సినిమాకు అల్లరి నరేష్ ఫ్లాప్ మూవీ టైటిల్ పెడుతున్నారా.. ?

బాలకృష్ణ,బోయపాటి సినిమాకు అల్లరి నరేష్ ఫ్లాప్ మూవీ టైటిల్ పెడుతున్నారా.. ?

అల్లరి నరేష్, బాలకృష్ణ (File/Photo)

అల్లరి నరేష్, బాలకృష్ణ (File/Photo)

Balakrishna Boyapati Srinu BB 3 | బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రానికి అల్లరి నరేష్ నటించిన ప్లాప్ మూవీ టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు.

  బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. లెజెండ్, సింహా లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు అయితే తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ  సినిమాకు ఏ టైటిల్ పెట్టాలనే దానిపై బోయపాటి శ్రీను మల్లగుల్లాలు పడుతున్నాడు. ఇక బాలయ్య సినిమా అంటే టైటిల్ పవర్ఫుల్‌గా ఉండాల్సిందే. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాకు పలు టైటిల్స్ ముందు నుంచి ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి BB3 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొంత భాగం వారణాసిలో చిత్రీకరించాడు. ఈ సినిమాలో బాలయ్య కవల సోదరులు పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. అందులో ఒక క్యారెక్టర్ అఘోరా అయితే.. మరొకటి ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ రోర్ అదేనండి టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో బాలయ్య అమలా పాల్‌తో పాటు మరో కొత్త హీరోయిన్‌ నటించే అవకాశం ఉంది.

  బాలయ్య బోయపాటి శ్రీను (Balakrishna boyapati)
  బాలకృష్ణ

  బాలయ్య కూడా ఈ చిత్రాన్ని హడావుడిగా కాకుండా.. కరోనా ఓ స్థాయిలో తగ్గిన తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడట. సెట్‌లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లెమ్ అయితే మొత్తం అప్‌సెట్ అవుతుంది. దాంతో పాటు నిర్మాతకు ఖర్చు తడిసి మోపెడవుతుందనే ఉద్దేశ్యంతో బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక చిత్రానికి ముందుగా ‘మోనార్క్’ అనే టైటిల్ ప్రచారం జరిగింది. ఆ తర్వాత ‘సూపర్ మేన్’ అనే పేరును కూడా పరిశీలించారు. ‘మొనగాడు’ అనే పేరు కూడా పరిశీలనకు వచ్చింది. తాజాగా  ఈ చిత్రానికి ‘డేంజర్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట.

  బాలకృష్ణ,బోయపాటి శ్రీను (Twitter/balakrishna boyapati)
  బాలయ్య, బోయపాటి శ్రీను (File/Photos)

  దాదాపు ‘డేంజర్’ అనే టైటిల్ ఖరారయ్యే అవకాశాలున్నాయి. 2005లో అల్లరి నరేష్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కానీ ఈ సినిమా వచ్చి దాదాపు 15 యేళ్లు అవుతుంది. ఒక సినిమాకు అదే టైటిల్ పెట్టాలంటే మినిమం పదేళ్లు కంప్లీట్ కావాలి. కాబట్టి ఈ సినిమాకు ‘డేంజర్’ అనే టైటిల్ పెట్టడానికి ఎలాంటి అభ్యంతరాలు కూడా లేవు. థమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వినాయక చవితికి ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి అల్లరి నరేష్.. బాలయ్య నటించిన ‘బంగారు బుల్లోడు’ టైటిల్‌తో వస్తుంటే.. బాలకృష్ణ.. అల్లరి నరేష్. టైటిల్ ‘డేంజర్’తో రాబోవడం విచిత్రమనే చెప్పాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Allari naresh, Balakrishna, Balayya, BB3, Boyapati Srinu, NBK 106, Tollywood

  ఉత్తమ కథలు