BB3 బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలో కీలక పాత్రలో బీజేపీ జాతీయ నేత..

ప్రస్తుతం  టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుదర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్నసంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: September 27, 2020, 6:44 PM IST
BB3 బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలో కీలక పాత్రలో బీజేపీ జాతీయ నేత..
బాలయ్య, బోయపాటి Photo : Twitter
  • Share this:
ప్రస్తుతం  టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుదర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్నసంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. సింహా, లెజెండ్ లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు అయితే తారాస్థాయిలో ఉన్నాయి. ఈ  సినిమాకు ఏ టైటిల్ పెట్టాలనే దానిపై బోయపాటి శ్రీను మల్లగుల్లాలు పడుతున్నాడు. ఇక బాలయ్య సినిమా అంటే టైటిల్ పవర్ఫుల్‌గా ఉండాల్సిందే. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాకు పలు టైటిల్స్ ముందు నుంచి ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి BB3 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొంత భాగం వారణాసిలో చిత్రీకరించారు. ఈ సినిమాలో బాలయ్య కవల సోదరులు పాత్రలో నటిస్తున్నారు.  అందులో ఒక క్యారెక్టర్ అఘోరా అయితే.. మరొకటి ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని చెబుతున్నారు.

బాలకృష్ణ (File/Photo)


ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ రోర్ అదేనండి టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో బాలయ్య సరసన కొత్త హీరోయిన్‌‌ను పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు సిమ్రన్ మరో కథానాయికగా నటించబోతున్నట్టు సమాచారం. తాజాగా ఈ సినిమాలో మరో లేడీ ఓరియంటెడ్ పాత్ర ఉందని చెబుతున్నారు. ఆ క్యారెక్టర్ కోసం సీనియర్ హీరోయిన్ జయప్రదను సంప్రదించి సినిమాలో ఆమె పాత్ర గురించి చెప్పారట. వెంటనే జయప్రద ఈ సినిమాలో ఆ పాత్ర చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. త్వరలో జయప్రద క్యారెక్టర్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. గతంలో జయప్రద బాలకృష్ణ హీరోగా నటించిన ‘మహారథి’లో హీరో అత్త పాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా.

బాలకృష్ణ,జయప్రద (Twitter/Photo)


మరోవైపు ఈ చిత్రంలో బాలయ్య సహాయకుడి పాత్రకు మంచి ఇంపార్టెన్స్ వుందట. ఈ క్యారెక్టర్ కోసం పలువురు హీరోల పేర్లు పరిశీలించిన చిత్ర బృందం తాజాగా అల్లరి నరేష్‌తో ఈ పాత్ర చేయించాలని చూస్తోంది.ఇప్పటికే దర్శకుడు బోయపాటి శ్రీను అల్లరి నరేష్‌కు కలిసి ఈ పాత్ర ఎంత పవర్ఫుల్లో వివరించాడట. దీంతో అల్లరి నరేష్ ఈ  సినిమాలో యాక్ట్ చేయడాకి ఒప్పుకున్నట్టు సమాచారం. గతేడాది మహేష్ బాబు.. ‘మహర్షి’ సినిమాలో అల్లరి నరేష్ స్నేహితుడి పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక థమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలో విలన్‌గా సోనూసూద్ యాక్ట్ చేయనున్నట్టు సమాచారం. ఇక చిత్రానికి ముందుగా ‘మోనార్క్’ అనే టైటిల్ పెడతారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ‘సూపర్ మేన్’, మొనగాడు, డేంజర్, యమ డేంజర్ అనే పేర్లు పరిశీలనకు వచ్చాయి. ఫైనల్‌గా బాలయ్య, బోయపాటి శ్రీను సినిమాకు ఏ టైటిల్ పెడతారనేది ఆసక్తికరంగా మారింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 27, 2020, 6:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading