హోమ్ /వార్తలు /సినిమా /

బాలకృష్ణ దబిడీ దిబిడే.. నువ్వు మాములోడివి కాదు సామి..

బాలకృష్ణ దబిడీ దిబిడే.. నువ్వు మాములోడివి కాదు సామి..

నందమూరి బాలకృష్ణ (Twitter/Photo)

నందమూరి బాలకృష్ణ (Twitter/Photo)

అవును బాలకృష్ణ ఒక్కసారి రంగంలోకి దిగాడంటే దబిడీ దిబిడే. ఎందుకంటే ఒకసారి బాలయ్య షూటింగ్‌లో అడుగుపెట్టాడంటే.. అది కంప్లీట్ అయ్యేంతవరకు ఒదిలిపెట్టడు. తాజాగా అదే జరిగింది.

  అవును బాలకృష్ణ ఒక్కసారి రంగంలోకి దిగాడంటే దబిడీ దిబిడే. ఎందుకంటే ఒకసారి బాలయ్య షూటింగ్‌లో అడుగుపెట్టాడంటే.. అది కంప్లీట్ అయ్యేంతవరకు ఒదిలిపెట్టడు. తాజాగా ఈయన బోయపాటి శ్రీను సినిమా షూటింగ్‌లో రీసెంట్‌గా జాయిన్ అయ్యాడు. ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో ఇంటర్వెట్‌కు సీక్వెన్స్‌కు సంబంధించిన సన్నివేశాలతో పాటు.. కొన్ని యాక్షన్ మూమెంట్స్‌ను తెరెక్కించినట్టు సమాచారం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్టు చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసాడు. మొత్తానికి మొన్ననే షూటింగ్‌లో జాయిన్ అయిన బాలయ్య.. ఇంత త్వరగా షెడ్యూల్ కంప్లీట్  చేయడాన్ని చూసి షూటింగ్ విషయంలో బాలకృష్ణ డెడికేషన్‌ను చూసి మెచ్చుకోవాల్సిందే. ఉగాది తర్వాత ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్‌ను వారణాసిలో ప్లాన్  చేస్తున్నారు.  ఈ చిత్రం కోసం బాలయ్య ఏకంగా గుండు కూడా చేయించుకున్న సంగతి తెలిసిందే కదా. గుండుతో బాలయ్య సరికొత్తగా కనిపించబోతున్నాడు. అంతేకాదు ఈ సినిమా కోసం బాలకృష్ణ ఏకంగా 15 కిలోల బరువు తగ్గారు.

  Balakrishna new look
  గుండుతో బాలయ్య (nandamuri balakrishna)

  బాలయ్యతో బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న  ఈ చిత్రాన్ని వారణాసి, రాయలసీమ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మరోసారి రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. అందులో ఒకటి అఘోర కాగా.. రెండోది ఫాక్షనిస్ట్. అంతేకాదు బాలకృష్ణ ఇందులో కవల సోదరులుగా కనిపించనున్నాడట. గతంలో బాలకృష్ణ.. కవల సోదరులుగా ‘అపూర్వ సహోదరులు’, ‘సుల్తాన్’, ‘అల్లరి పిడుగు’ చిత్రాల్లో కనిపించారు. మధ్యలో చాలా చిత్రాల్లో డ్యూయల్ రోల్లో నటించిన కవల సోదరులుగా మాత్రం నటించలేదు. ఇపుడు చాల ఏళ్ల తర్వాత బాలకృష్ణ.. కవల సోదరులుగా కనబడబోతున్నాడన్నమాట. ముఖ్యంగా కొన్ని నిమిషాల వ్యవధిలో జన్మించిన కవల సోదరుల జీవితాల్లో నవగ్రహాలు..వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసాయనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను బోయపాటి శ్రీను  తెరకెక్కిస్తున్నాడు. చిన్నపుడే విడిపోయిన వీళ్లు మళ్లీ ఎలా కలిసారనేదే ఈ సినిమా స్టోరీ అని చెబుతున్నారు.

  45 ఏళ్ల సినీ కెరీర్‌లో నందమూరి బాలకృష్ణ మొదటిసారి అలా చేయబోతున్నాడు. ఇది చూసి అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే...
  బాలకృష్ణ,బోయపాటి శ్రీను సినిమా ప్రారంభోత్సవం (Twitter/Photo)

  ఈ సినిమాలో బాలకృష్ణ ‘అఘోర’గా పాత్ర ఇంటర్వెల్‌లో ఎంట్రీ ఇవ్వనుందని చెబుతున్నారు. ఈ సినిమాలో అఘోర పాత్రనే కీలకం అని చెబుతున్నారు. మరోపాత్ర రాయలసీమకు చెందిన ఫ్యాక్షనిస్ట్. టాలీవుడ్‌లో ఫ్యాక్షన్ సినిమాలనగానే ముందుగా బాలకృష్ణ పేరే గుర్తుకు వస్తోంది. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయారు. సింహా, లెజెండ్ వంటి భారీ బ్లాక్ బస్టర్స్ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అంజలి హీరోయిన్‌గా నటిస్తోంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, Balayya, Boyapati Srinu, NBK 106, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు