హోమ్ /వార్తలు /సినిమా /

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాలకృష్ణ ‘BB3’ యానిమేటేట్ టీజర్..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాలకృష్ణ ‘BB3’ యానిమేటేట్ టీజర్..

బాలయ్య ‘BB3’ యానిమేటెడ్ టీజర్ (Twitter/Photo)

బాలయ్య ‘BB3’ యానిమేటెడ్ టీజర్ (Twitter/Photo)

ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా  చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఒక షెడ్యూల్ కంప్లీటైన తర్వాత కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన యానిమేటెడ్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...

  ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా  చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఒక షెడ్యూల్ కంప్లీటైన తర్వాత కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా కోసం ఈ చిత్రం కోసం బాలయ్య ఏకంగా గుండు కూడా చేయించుకున్నాడు. ఇక బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా BB3 అంటూ విడుదల చేసిన ఫస్ట్ రోర్ టీజర్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి బోయపాటి శ్రీను తనదైన మార్క్‌తో బాలయ్యను స్క్రీన్ పై ప్రెజెంట్ చేయనున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన యానిమేటెడ్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యానిమేటేట్ టీజర్‌ను ఎస్ఆర్ఏ 1 ఎంటర్టైన్మెంట్ రూపొందించారు. ఇది బాలయ్య ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేస్తోంది.


  BB3వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అదే కన్ఫామ్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమాలో బాలయ్య మరోసారి రెండు పాత్రల్లో కనిపించనున్నారు.  అందులో ఒకటి అఘోర కాగా.. రెండోది ఫాక్షనిస్ట్ పాత్ర అని  చెబుతున్నారు. ఈ చిత్రంలో నయనతార, అంజలి పేర్లను పరిశీలిస్తున్నారు.  ప్రస్తుతం బాలయ్య సరైన సక్సెస్ లేక వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. మరి బోయపాటి శ్రీనుతో చేస్తోన్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, Balayya, BB3, Boyapati Srinu, NBK 106, Tollywood

  ఉత్తమ కథలు