Balakrishna | Akhanda : అందని ద్రాక్షగా మారిన బాలయ్య అఖండ.. కొత్త రిలీజ్ డేట్ అదేనా..

‘అఖండ’లో బాలకృష్ణ (Twitter/Photo)

Balakrishna | Akhanda : నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న యాక్షన్ ఫిల్మ్ అఖండ. ఈ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

 • Share this:
  నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). భారీ స్థాయిలో భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా విడుదల తేదిపై ఇంతవరకు క్లారిటీ లేదు. మొన్నటి వరకు ఈ సినిమా ఈ వచ్చే నవంబర్‌లో విడుదలకానుందని అన్నారు. అఖండ దీపావళి కానుకగా గర్జన ఉంటుందిని టాక్ నడిచింది. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమా డిసెంబర్ నెలకి షిఫ్ట్ అయ్యుపోయినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో కూడా క్లారిటీ లేదు. ఈ సినిమాను డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

  ఇక బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం.

  Bommarillu Bhaskar: ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కోసం బొమ్మరిల్లు భాస్కర్ తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

  ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా వస్తోంది. ఈ సినిమా అన్ని అంచనాలుకి తగ్గట్టే అదిరే బిజినెస్ ని కూడా జరుపుకుంటోందని తెలుస్తోంది. ఈ చిత్రం నైజాం హక్కులు కూడా భారీ ధర పలికినట్టు టాక్ నడుస్తోంది. నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఏకంగా 19కోట్లకు కొనుగోలు చేశారని అంటున్నారు. ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా మొత్తం ఆంధ్ర హక్కులు రూ. 35 కోట్ల రేషియోకు అమ్ముడయ్యాయి, ఇక సీడెడ్ రీజియన్ హక్కులు రూ .12 కోట్లకు అమ్ముడు పోయాయని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. అఖండలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది.

  ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుందని టాక్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ద్వారక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

  Keerthy Suresh : నిమ్మ పండు రంగు చీరలో పిచ్చెక్కించిన కీర్తి సురేష్..

  ఇక అఖండ దాదాపు పూర్తవ్వడంతో బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టే ఆలోచనో ఉన్నారట. క్రాక్ డైరక్టర్ గోపీచంద్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. బాలయ్య గోపీచంద్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది.

  గోపిచంద్ గతంలో డాన్ శీను, బలుపు, పండగ చేస్కో లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గత సంక్రాంతికి రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ బాగా ఆకట్టుకుంది. ఈ కథలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాలో బాలయ్య సరసన త్రిష  (Trisha Krishnan ) నటించనుందని తెలుస్తోంది.
  Published by:Suresh Rachamalla
  First published: