Balakrishna - Akhanda: బాలకృష్ణ ‘అఖండ’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా.. ? అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. కరోనా సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే.. ఈ పాటికి థియేట్రికల్ రన్ ముగిసి ఓటీటీతో పాటు శాటిలైట్స్‌లో కూడా ఈ సినిమా ప్రసారమై ఉండేది. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా అన్ని సినిమాల మాదిరే ఈ మూవీ విడుదల తేది కూడా వాయిదా పడింది. తాజాగా ‘అఖండ’ సినిమా విడుదల కు ముహూర్తం ఖరారైనట్టు వార్తలు వస్తున్నాయి. ‘అఖండ’ మూవీ విషయానికొస్తే.. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న ‘అఖండ’ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయింది. ఉగాది సందర్భంగా విడుదలైన ’అఖండ’ టైటిల్ పోస్టర్‌తో పాటు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.అంతేకాదు టాలీవుడ్‌లో తక్కువ టైమ్‌లో 50M వ్యూస్ క్రాస్ చేసిన టీజర్‌గా బాలకృష్ణ ‘అఖండ’ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ‘అఖండ’ సినిమాలో బాలకృష్ణ మూడు విభిన్న పాత్రల్లో నటించనున్నారు. ఒకటి కలెక్టర్ పాత్ర అయితే. .రెండోది ఫ్యాక్షనిస్ట్, మూడోది అఘోర అని ఈ సినిమా పోస్టర్స్ బట్టి అభిమానులు అంచనా వేస్తున్నారు.
ఒకరే మూడు పాత్రల్లో కనిపిస్తారా.. లేదా ఇద్దరు లేదా మూడు పాత్రల్లో బాలయ్య నటిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. 'అఖండ' టీజర్ విడుదలైన కేవలం 24 గంటల్లోనే 12 మిలియన్ల వ్యూస్‌ని సొంతం చేసుకుంది. . ఈ టీజర్‌లో బాలకృష్ణ గెటప్.. దీనికి తోడు బ్యాగ్రౌండ్ స్కోర్.. ఆయన చెప్పిన డైలాగ్‌లు అభిమానులతో పాటు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో తెగ వైరల్ అవుతోంది టీజర్. ఇప్పటికే దక్షిణాదిలో సీనియర్ హీరోల టీజర్ రికార్డులను బ్రేక్ చేసింది.
నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ ముందు వరకు వికారాబాద్ అడవుల్లో ప్లాన్ చేసారు. శ్రీకాంత్‌తో పాటు మరి కొంత ఆర్టిస్టులపై క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా జూలై 1 నుంచి 40 రోజుల పాటు గండిపేటలో ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన షెడ్యూల్‌ను షూట్ చేయనున్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కానుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 10న విడుదల తేదిని ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది. ఈ సినిమాలో అఘోరగా బాలయ్య పాత్ర హైలెట్ అని చెబుతున్నారు.
ద్వారక క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులు భారీ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడు పోయినట్టు సమాచారం. ఆ సంగతి పక్కన పెడితే.. బాలకృష్ణ రీసెంట్‌గా రవితేజతో ‘క్రాక్’ వంటి పోలీస్ మాస్ యాక్షన్ మూవీతో మెప్పించిన గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దాంతో పాటు సంతోష్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి, పూరీ జగన్నాథ్ తో పాటు ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 ప్రాజెక్ట్‌ను తనయుడు మోక్షజ్ఞ హీరోగా బాలయ్య దర్శకత్వంలో తెరకెక్కించనున్నట్టు బాలయ్య ప్రకటించారు. సీక్వెల వరుస ప్రాజెక్టులు చేయడానికి బాలయ్య రెడీ అవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.