Home /News /movies /

BALAKRISHNA BOYAPATI SRINU AKHANDA MOVIE RELEASE DATE OFFICIALLY ANNOUNCED VERY SOON TA

Balakrishna - Akhanda : బాలకృష్ణ ‘అఖండ’ విడుదల తేది పై క్రేజీ అప్‌డేట్.. త్వరలో అఫీషియల్ ప్రకటన..

‘అఖండ’లో బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ (Twitter/Photo)

‘అఖండ’లో బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ (Twitter/Photo)

Akhanda - NBK : నందమూరి నట సింహా బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని ఖరారు చేసినట్టు సమాచారం.

ఇంకా చదవండి ...
    Akhanda - NBK : నందమూరి నట సింహా బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాతో హాట్రిక్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఉగాది సందర్భంగా విడుదలైన ’అఖండ’(Akhanda) టైటిల్ పోస్టర్‌తో పాటు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.అంతేకాదు టాలీవుడ్‌లో తక్కువ టైమ్‌లో 50M వ్యూస్ క్రాస్ చేసిన టీజర్‌గా బాలకృష్ణ ‘అఖండ’ సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ‘అఖండ’ సినిమాలో బాలకృష్ణ మూడు విభిన్న పాత్రల్లో నటించనున్నారు. ఒకటి కలెక్టర్ పాత్ర అయితే. .రెండోది ఫ్యాక్షనిస్ట్, మూడోది అఘోర అని ఈ సినిమా పోస్టర్స్‌ బట్టి అభిమానులు అంచనా వేస్తున్నారు.

    ఇప్పటికే ఈ సినిమా నుంచి అడిగా అడిగా అంటూ విడుదల చేసిన మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.   ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా  జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో కథానాయికగా పూర్ణ యాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ  సినిమాను నవంబర్ 4న దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయమై ఈ బుధవారం అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.

    Prabhas : ప్రభాస్ దూకుడు మాములుగా లేదుగా.. అపుడే 25వ సినిమా కోసం భారీ స్కెచ్..

    ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా మొత్తం ఆంధ్ర హక్కులు రూ. 35 కోట్ల రేషియోకు అమ్ముడయ్యాయి, నైజాం ప్రాంతం రూ. 10 కోట్లుకు అమ్మడు అయ్యాయని... సీడెడ్ రీజియన్ హక్కులు రూ .12 కోట్లకు అమ్ముడు పోయాయని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

    Balakrishna Remakes: నందమూరి నట సింహా బాలకృష్ణ తన ఫిల్మీ కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

    ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది. అఖండ షూటింగ్ పూర్తి అవ్వడంతో ఇక బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ద్వారక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

    Balakrishna Industry Hits: మంగమ్మ గారి మనవడు టూ నరసింహనాయుడు వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలకృష్ణ సినిమాలు ఇవే..


    ఇక అఖండ దాదాపు పూర్తవ్వడంతో బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టే ఆలోచనో ఉన్నారట. క్రాక్ డైరక్టర్ గోపీచంద్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. బాలయ్య గోపీచంద్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది.

    Rajinikanth - Chiranjeevi - Balakrishna : ఆ విషయంలో చిరంజీవి, బాలకృష్ణ మధ్య నలిగిపోతున్న రజినీకాంత్..

    గోపిచంద్ గతంలో డాన్ శీను, బలుపు, పండగ చేస్కో లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గత సంక్రాంతికి రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ బాగా ఆకట్టుకుంది. ఈ కథలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాలో బాలయ్య సరసన త్రిష  (Trisha Krishnan ) నటించనుందని తెలుస్తోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Akhanda, Balakrishna, Boyapati Srinu, NBK, Pragya jaiswal, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు