హోమ్ /వార్తలు /movies /

Balakrishna | Akhanda : ఊహించని రీతిలో బాలకృష్ణ అఖండ ప్రీ రిలీజ్ బిజినెస్.. దబిడి దిబిడే..

Balakrishna | Akhanda : ఊహించని రీతిలో బాలకృష్ణ అఖండ ప్రీ రిలీజ్ బిజినెస్.. దబిడి దిబిడే..

అఖండ (Akhanda Photo : Twitter)

అఖండ (Akhanda Photo : Twitter)

Balakrishna | Akhanda : నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న యాక్షన్ ఫిల్మ్ అఖండ. ఈ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమాకు ఓ రేంజ్‌లో బిజినెస్ జరిగిందని అంటున్నారు.

ఇంకా చదవండి ...

నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కరోనా కేసులు తగ్గడంతో గతకొద్ది రోజులుగా ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్‌ గోవాలో జరుగుతోంది. కాగా తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఆ షెడ్యూల్‌ కూడా పూర్తి అయ్యిందని తెలుస్తోంది. దీంతో ఇక త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనీ చూస్తోందట చిత్రబృందం. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం.

ఇక ఈ సినిమా నుంచి ఉగాది సందర్భంగా ఓ టీజర్‌‌ను విడుదల చేయగా.. ఆ టీజర్ మంచి ఆదరణ పొందింది. దీనికి తోడు ‘సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత వస్తున్న ఈ కాంబినేషన్ అఖండ కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అందులో భాగంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయని సమాచారం. అంతేకాదు ఈ అఖండ సినిమా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ఫిగర్స్ టచ్ చెయ్యనున్నట్టుగా తెలుస్తోంది.

Maha Samudram : నెట్ ఫ్లిక్స్‌ చేతిలో మహా సముద్రం డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా మొత్తం ఆంధ్ర హక్కులు రూ. 35 కోట్ల రేషియోకు అమ్ముడయ్యాయి, నైజాం ప్రాంతం రూ. 10 కోట్లుకు అమ్మడు అయ్యాయని... సీడెడ్ రీజియన్ హక్కులు రూ .12 కోట్లకు అమ్ముడు పోయాయని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. అఖండలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది.

ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది. అఖండ షూటింగ్ పూర్తి అవ్వడంతో ఇక బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ద్వారక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Most Eligible Bachelor : సెన్సార్ పూర్తి చేసుకున్న అఖిల్, పూజా హెగ్డేల ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’..

ఇక అఖండ దాదాపు పూర్తవ్వడంతో బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టే ఆలోచనో ఉన్నారట. క్రాక్ డైరక్టర్ గోపీచంద్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. బాలయ్య గోపీచంద్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది.

గోపిచంద్ గతంలో డాన్ శీను, బలుపు, పండగ చేస్కో లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గత సంక్రాంతికి రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ బాగా ఆకట్టుకుంది. ఈ కథలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాలో బాలయ్య సరసన త్రిష  (Trisha Krishnan ) నటించనుందని తెలుస్తోంది.

First published:

Tags: Akhanda movie, Balakrishna, Boyapati Srinu, Tollywood news, Trisha Krishnan

ఉత్తమ కథలు