Balakrishna | Akhanda : బాలకృష్ణపై భారీ ఆశలు పెట్టుకున్న దిల్ రాజు.. అఖండ నైజాం రైట్స్ అంత ధర పలికాయా...

బాలకృష్ణ (File/Photo)

Balakrishna | Akhanda : నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న యాక్షన్ ఫిల్మ్ అఖండ. ఈ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమాకు ఓ రేంజ్‌లో బిజినెస్ జరిగిందని అంటున్నారు.

  • Share this:
    నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది. దీంతో ఇక త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనీ చూస్తోందట చిత్రబృందం. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం.

    ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా వస్తోంది. ఈ సినిమా అన్ని అంచనాలుకి తగ్గట్టే అదిరే బిజినెస్ ని కూడా జరుపుకుంటోందని తెలుస్తోంది. ఈ చిత్రం నైజాం హక్కులు కూడా భారీ ధర పలికినట్టు టాక్ నడుస్తోంది. నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఏకంగా 19కోట్లకు కొనుగోలు చేశారని అంటున్నారు. ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా మొత్తం ఆంధ్ర హక్కులు రూ. 35 కోట్ల రేషియోకు అమ్ముడయ్యాయి, ఇక సీడెడ్ రీజియన్ హక్కులు రూ .12 కోట్లకు అమ్ముడు పోయాయని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. అఖండలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది.

    Telugu Anchors : ఈ అందాల తెలుగు టీవీ యాంకర్ల జీవిత భాగస్వాములు ఎవరు.. ఎలా ఉంటారో తెలుసా..

    ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది. అఖండ షూటింగ్ పూర్తి అవ్వడంతో ఇక బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ద్వారక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

    ఇక అఖండ దాదాపు పూర్తవ్వడంతో బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టే ఆలోచనో ఉన్నారట. క్రాక్ డైరక్టర్ గోపీచంద్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. బాలయ్య గోపీచంద్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది.

    గోపిచంద్ గతంలో డాన్ శీను, బలుపు, పండగ చేస్కో లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గత సంక్రాంతికి రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ బాగా ఆకట్టుకుంది. ఈ కథలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాలో బాలయ్య సరసన త్రిష  (Trisha Krishnan ) నటించనుందని తెలుస్తోంది.
    Published by:Suresh Rachamalla
    First published: