Home /News /movies /

BALAKRISHNA BOYAPATI SRINIVAS AKHANDA LOCKS RAM CHARAN NTR RRR RELEASE DATE HERE ARE THE DETAILS SR

Balakrishna : ఎన్టీఆర్‌ రామ్ చరణ్‌ల స్థానంలో బాలకృష్ణ.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్..

బాలకృష్ణ Photo : Twitter

బాలకృష్ణ Photo : Twitter

Balakrishna : నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న యాక్షన్ ఫిల్మ్ అఖండ అని తెలిసిందే.

    నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna) ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda) అని తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్‌ను పార్ట్‌ను ముగించుకుంది. విడుదలకు రెడీ అవుతోంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు అఖండ అక్టోబర్ 13 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని తెలుస్తోంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండడంతో నందమూరి బాలకృష్ణ అఖండను దసరా కానుకగా విడుదలకు చేయడానికి చిత్రబృందం రిలీజ్ డేట్‌ను లాక్ చేసారని సమాచారం అందుతోంది. ఈ విషయంలో అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది. అయితే మొదట అక్టోబర్ 13న రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల RRR  (Ram Charan, NTR) రిలీజ్‌ కానుందని ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా విడుదలకావడం లేదు. దీంతో అదే స్థానంలో అఖండను లాక్ చేశారు. అఖిల్ అక్కినేని (Akhil Akkineni-PooJa Hegde) మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా విడుదల తేదిని లాక్ చేశారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 12 విడుదలకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

    ఇక అఖండ విషయానికి వస్తే.. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఉగాది సందర్భంగా ఓ టీజర్‌‌ను విడుదల చేయగా.. ఆ టీజర్ మంచి ఆదరణ పొందింది. ఈ కాంబినేషన్‌లో ‘సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత వస్తున్న ఈ కాంబినేషన్ అఖండ కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

    ఇక మరోవైపు థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయని సమాచారం. అంతేకాదు ఈ అఖండ సినిమా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ఫిగర్స్ టచ్ చెయ్యనున్నట్టుగా సమాచారం.  ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది.

    ఈ సినిమా తర్వాత బాలయ్య క్రాక్ డైరక్టర్ గోపీచంద్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. బాలయ్య గోపీచంద్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. గోపిచంద్ గతంలో డాన్ శీను, బలుపు, పండగ చేస్కో లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గత సంక్రాంతికి రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ బాగా ఆకట్టుకుంది. ఈ కథలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తారని సమాచారం అందుతోంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Balakrishna, Jr ntr, Ram Charan, RRR

    తదుపరి వార్తలు