Home /News /movies /

BALAKRISHNA BOYAPATI SREENUS AKKHANDA MOVIE MAKING VIDEO RELEASED TA

BalaKrishna - Akhanda : బాలకృష్ణ ‘అఖండ’ మూవీ మేకింగ్ వీడియో విడుదల.. సోషల్ మీడియాలో వైరల్..

‘అఖండ’ మేకింగ్ వీడియో విడుదల (Twitter/Photo)

‘అఖండ’ మేకింగ్ వీడియో విడుదల (Twitter/Photo)

BalaKrishna - Akhanda : నందమూరి నట సింహం బాలకృష్ణ  రెండు విభిన్న పాత్రల్లో  మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన యాక్షన్ ఫిల్మ్ అఖండ. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేశారు.

  BalaKrishna - Akhanda : నందమూరి నట సింహం బాలకృష్ణ  రెండు విభిన్న పాత్రల్లో  మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది.  జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ  ఇతర కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ గతేడాది డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది.  ఈ సినిమా  గురువారంతో   50 రోజులు పూర్తి చేసుకుని ఇపుడు డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ దగ్గర శివ తాండవం చేసిన ఈ సినిమా ఓటీటీలో కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. అక్కడ వచ్చిన క్షణం నుంచే రికార్డులు తిరగరాస్తున్నారు బాలయ్య.

  ఈ సినిమా ఓటీటీ వేదికగా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో వేచి చూసిన ఫ్యాన్స్.. వచ్చీ రాగానే మరోసారి డిస్నీ హాట్ స్టార్‌లో ఈ సినిమా చూస్తున్నారు.  తాజాగా ‘అఖండ’ మూవీ  హాట్ స్టార్ డిస్నీలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డులను సొంతం చేసుకుంది. ఇదే విషయాన్ని వాళ్లు అధికారికంగా ట్వీట్ కూడా చేసారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


  ‘అఖండ’ గా ఆ పాత్ర బాలయ్య తప్ప ఇంకే హీరో కూడా చేయలేడంటూ నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కామన్ ఆడియన్స్ కూడా బాలయ్య నటనకు ఫిదా అయిపోతున్నారు. లాజిక్స్ లేకపోయినా కూడా మాస్ మ్యాజిక్ ఈ సినిమాలో బాగానే పని చేసింది. సినిమాలో చిన్న చిన్న లోపాలున్నా కూడా కాంబినేషన్ క్రేజ్ సినిమాకు భారీ లాభాలు తీసుకొచ్చింది.

  Mahesh - NTR- Akhil : మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇపుడు అఖిల్.. ఆ విధంగా సక్సెస్ అందుకున్న హీరోలు..

  50 రోజులు.. 100 రోజులు.. 150 రోజులు.. 175 రోజులు.. 200 రోజులు.. ఇలాంటి పోస్టర్స్ బహుశా ఒకప్పుడు కనిపించేవి కానీ గత పదేళ్లుగా కనిపించడం లేదు. ఒకప్పుడు తమ హీరో సినిమా ఇన్ని సెంటర్స్‌లో 100 రోజులు ఆడిందంటూ గర్వంగా చెప్పుకునేవాళ్లు అభిమానులు. కానీ ఇప్పుడు అలా కాదు.. మా హీరో సినిమా  ఫస్ట్ వీక్‌లో ఇన్ని వందల కోట్లు వసూలు చేసిందని చెప్పుకుంటున్నారు. ఈ సమయంలో మూడు వారాలు ఆడిందంటే చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య ‘అఖండ’ 50 రోజుల పూర్తి చేసుకొని హిస్టరీ రిపీట్ చేసింది. అంతేకాదు ఈ సినిమా 50వ రోజు 103 థియేటర్స్‌లో ప్రదర్శించ బడటం ఒక రికార్డు అని చెప్పాలి.

  Mahesh Babu - Namrata : మహేష్ బాబు, నమ్రత సహా తమ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్లను పెళ్లి చేసుకున్న సినీ ప్రముఖులు వీళ్లే..

  రీసెంట్‌గా ‘అఖండ’ మూవీ రూ. 150 కోట్ల గ్రాస్ క్లబ్‌లో అడుగుపెట్టింది. ఇక నాన్ థియేట్రికల్ కలిపి ఈ సినిమా రూ. 200 క్లబ్బులో ప్రవేశించినట్టు ‘అఖండ’ చిత్ర నిర్మాతలు రూ. 200 క్లబ్‌తో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు. 50 రోజుల మాట వినబడక చాలా రోజులు అయిపోయింది. 2020 పండగ సినిమాలు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో అతి కష్టమ్మీద 50 రోజులు ఆడాయి. ఆ తర్వాత కరోనా రావడంతో ఆ మాటే గగనం అయిపోయింది.

  NTR - ANR: అక్కినేని, నందమూరి మధ్య ఉన్న ఈ పోలికలు తెలుసా.. ఎన్టీఆర్ వర్సెస్ ఏఎన్నార్..

  అలాంటిదిప్పుడు అఖండ సినిమా 50 రోజుల పండగ జరుపుకుంటోంది. అది చూసి అంతా షాక్ అవుతున్నారు. బాలయ్య మాస్ ఇమేజ్‌కు పొర్లు దండాలు పెడుతున్నారు. 50 రోజులు అనే మాట మరిచిపోయి చాలా రోజులైపోయింది. కానీ అఖండ సినిమాతో అది గుర్తు చేసారు బాలయ్య. ఇప్పుడున్న సమయంలో  20 రోజులు థియేటర్స్‌లో కనిపించడమే గొప్ప విషయం అనుకుంటే.. అఖండ సినిమా ఏకంగా 50 రోజులు కంప్లీట్ చేసుకొని ఇంకా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబడుతూ ఉండటం విశేషం.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Akhanda movie, Balakrishna, Boyapati Sreenu, Hot star, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు