BALAKRISHNA BOYAPATI SREENU SENSATIONAL BLOCKBUSTER LEGEND MOVIE COMPLETED 8 YEARS AND HERE THE FINAL COLLECTIONS PK
Legend movie @ 8 Years: బాలకృష్ణ బ్లాక్‌బస్టర్ ‘లెజెండ్’కు 8 ఏళ్లు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..
బాలయ్య లెజెండ్ సినిమాకు 8 ఏళ్లు పూర్తి (legend movie)
Legend movie @ 8 Years: 2010లో సింహా (Simha) సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న తర్వాత బాలయ్యకు (Balakrishna) సరైన విజయం రావడానికి చాలా సమయం పట్టింది. ఇంకా చెప్పాలంటే 2010 నుంచి 2014 వరకు బాలయ్య చేసిన సినిమాలన్నీ దారుణంగా నిరాశ పరిచాయి.
2010లో సింహా (Simha) సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న తర్వాత బాలయ్యకు (Balakrishna) సరైన విజయం రావడానికి చాలా సమయం పట్టింది. ఇంకా చెప్పాలంటే 2010 నుంచి 2014 వరకు బాలయ్య చేసిన సినిమాలన్నీ దారుణంగా నిరాశ పరిచాయి. పరమవీరచక్ర (Parama Veera Chakra), అధినాయకుడు (Adhinayakudu) లాంటి సినిమాలకు కనీసం శాటిలైట్ కూడా కాలేదు. అంత దారుణంగా బాలయ్య మార్కెట్ పడిపోయింది. మరోవైపు శ్రీమన్నారాయణ లాంటి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఇలాంటి సమయంలో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో పడిపోయాడు బాలయ్య. సరిగ్గా అదే సమయంలో వచ్చింది లెజెండ్ (Legend) సినిమా. సింహా తర్వాత భారీ అంచనాల మధ్య జూనియర్ ఎన్టీఆర్‌తో బోయపాటి శ్రీను (Boyapati Sreenu) తెరకెక్కించిన దమ్ము సినిమా ఫ్లాప్ కావడంతో.. ఈయనకు కూడా హిట్ అవసరం పడింది. ఇలాంటి సమయంలో మరోసారి తనకు అచ్చొచ్చిన బాలయ్యతోనే లెజెండ్ సినిమా చేసాడు బోయపాటి. ఈ చిత్రం మార్చ్ 28, 2014న విడుదలై సంచలన విజయం సాధించింది. నటసింహం కెరీర్‌లో మొదటి 40 కోట్ల సినిమాగా నిలిచింది ఈ చిత్రం. ఈ సినిమా విడుదలై 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కలెక్షన్స్ ఓ సారి చూద్దాం..
లెజెండ్ సినిమాకు 32 కోట్ల బిజినెస్ జరిగింది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌పై ఉన్న క్రేజ్‌తో అంత బిజినెస్ జరిగింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మంచి కలెక్షన్స్ తీసుకొచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్స్ అప్పట్లో సంచలనం. పైగా ఈ సినిమాకు నంది అవార్డులు కూడా బాగానే వచ్చాయి. 8 ఏళ్ళ కిందే ఈ చిత్రం 40 కోట్లు వసూలు చేసింది. ఇంకా చెప్పాలంటే సీనియర్ హీరోలలో 40 కోట్ల షేర్ అందుకున్న మొదటి హీరో బాలయ్యే. వెంకటేష్ అప్పటికే సీతమ్మ వాకిట్లో..తో ఈ ఫీట్ అందుకున్నా అందులో మహేష్ బాబు ఉన్నాడు. ఇక బాలయ్య కెరీర్‌లో కూడా మొదటి 40 కోట్ల షేర్ అందుకున్న సినిమా ఇది. బాలయ్యకు అదిరిపోయే హిట్ ఇచ్చిన బోయపాటి.. 2021లో అఖండ అంటూ మరో బ్లాక్‌బస్టర్ ఇచ్చాడు. ఈ సినిమాకు 75 కోట్లకు పైగా షేర్ వచ్చింది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.