Home /News /movies /

BALAKRISHNA BOYAPATI SREENU NBK AKHANDA MOVIE TITLE SONG RELEASED ON SAKRANTHI FESTIVAL TA

NBK - Akhanda : బాలకృష్ణ సంక్రాంతి కానుక.. ‘అఖండ’ మూవీ నుంచి టైటిల్ సాంగ్ విడుదల..

బాలకృష్ణ ‘అఖండ’ టైటిల్ సాంగ్ విడుదల (Twiter/Photo)

బాలకృష్ణ ‘అఖండ’ టైటిల్ సాంగ్ విడుదల (Twiter/Photo)

NBK - Akhanda  : నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి పండగ సందర్భంగా ‘అఖండ’ టైటిల్ సాంగ్ విడుదల చేసారు.

ఇంకా చదవండి ...
    NBK - Akhanda  : నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది.  జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ గతేడాది డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఇంకా మంచి వసూళ్లను రాబడుతోంది. సంక్రాంతి కానుకగా వేరే సినిమాలు విడుదలైన ఇంకా రెండు రాష్ట్రాల్లో 85 థియేటర్స్‌లో ఈ సినిమా నడుస్తోంది.  ఇక 7వ వారంలో కూడా  ‘అఖండ’ ఇంకా  బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడని ప్రభంజనం ఇది. ముఖ్యంగా బాలయ్య పని అయిపోయింది అనుకున్న వాళ్ళకు దిమ్మ తిరిగిపోయేలా సమాధానం ఇచ్చారు.  అఖండ సినిమా  ఇప్పటి వరకు  రూ. 75 కోట్లకు పైగా షేర్ (135 కోట్ల గ్రాస్) వసూలు చేసింది.

    ఇక ఈ సినిమాకు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పాటు పాటలు కూడా అంతే పాపులర్ అయ్యాయి. టైటిల్ సాంగ్ ’అఖండ’తో పాటు ‘జై బాలయ్య’ పాటకు మాస్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు 50 రోజులకు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓ ట్రైలర్‌ను విడుదల చేశారు.  రీసెంట్‌గా  ఈ సినిమా నుంచి జై బాలయ్యతో పాటు ‘అడిగా అడిగా’  ఫుల్ సాంగ్స్‌ను విడుదల చేసారు. ఈ రోజు సంక్రాంతి పండగ  సందర్భంగా ‘అఖండ’ టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేసారు.   వచ్చే గురువావారం జనవరి 20 తో ఈ సినిమా 50 రోజుల పూర్తి చేసుకోనుంది.


    ఈ సినిమా పదిరోజుల్లో రూ. 100 కోట్ల క్లబ్‌కి చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. అఖండ 6వ వారంలోకి ఎంటర్ అయ్యి ఇప్పటికీ అదిరిపోయే కలెక్షన్స్ ని సాధిస్తోంది. 6వ వారంలో ఇరగదీసింది. సంక్రాంతి బరిలో ఉన్న చిత్రాలతో కూడా ‘అఖండ’ పోటీ పడుతోంది.అఖండ సినిమాకు ఇంత కలెక్షన్స్ ప్రభంజనం కురిసినా కూడా ఇప్పటికీ రెండు చోట్ల సినిమా సేఫ్ అవ్వలేదు.

    Chiranjeevi : పండగ రోజున తన రిటైర్మెంట్‌ను అఫీషియల్‌గా ప్రకటించిన చిరంజీవి.. మెగాస్టార్ సంచలన నిర్ణయం..

    టోటల్‌గా గుంటూరు, కృష్ణా మినహా మిగిలిన చోట్ల మాత్రం అఖండకు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి.రూ.  53 కోట్ల బిజినెస్ చేస్తే.. ఏకంగా రూ. 75 కోట్లు షేర్ వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది అఖండ. ఈ  సినిమాను ఈ నెల 21న హాట్ స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్  కానుంది.  ఇక మరోవైపు అఖండ టెలివిజన్ ప్రిమియర్ విషయంలో కూడా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ సినిమా శాటిలైట్స్ రైట్స్ దక్కించుకున్న స్టార్ మా.. అఖండ సినిమాను ఫిబ్రవరి 27 న ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.




    ఇక చివరగా అఖండ సినిమా జనవరి 20న అఫీషియల్ గా 50 రోజుల పండగను జరుపుకోనుంది. ఇండస్ట్రీలో 50 రోజులు ఓ సినిమా పూర్తి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. సినిమా రిలీజ్ కాస్త మిక్స్ డ్ టాక్ వస్తేనే నెల తిరిగే లోపు ఓటీటీలో పడిపోతోంది. అలాంటి నేపథ్యంలో అఖండ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 50 రోజులు ఆడటం మామూలు విషయం కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

    Acharya : ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ బాటలో ఆచార్య విడుదల తేది వాయిదా.. అధికారిక ప్రకటన..


    ఇక సుదర్శన్ 35 ఎంఎం వేదికగా ఈ వేడుకలు నిర్వహంచనున్నట్లు తెలిసింది. అంతేకాదు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సైతం 50 రోజుల వేడుకను గ్రాండ్ గా నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందుకోసం నిర్మాత స్వస్థలం అయిన సూర్యపేటలో భారీ ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు బాలయ్యతో పాటు, సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చాలా ఏళ్ల తర్వాత సిసలైన క్లీన్ బ్లాక్ బస్టర్ సినిమాగా అఖండ నిలిచిందని బాలయ్య ఫ్యాన్స్ ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Akhanda movie, Balakrishna, Boyapati Sreenu, NBK, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు