Home /News /movies /

BALAKRISHNA BOYAPATI SREENU AKHANDA TITLE SONG PROMO GOES VIRAL ON SOCIAL MEDIA GETS 3 MILLION VIEWS SR

Balakrishna | Akhanda : అదరగొడుతోన్న అఖండ టైటిల్ సాంగ్‌ ప్రోమో.. త్రీ మిలియన్ వ్యూస్‌తో రచ్చ..

Akhanda title song Photo : Twitter

Akhanda title song Photo : Twitter

Balakrishna | Akhanda : నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న యాక్షన్ ఫిల్మ్ అఖండ. ప్రమోషన్స్‌లో భాగంగా దీపావళి సందర్భంగా ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్‌ భమ్ అఖండకు సంబంధించిన ప్రోమోను వదిలారు.

ఇంకా చదవండి ...
  నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). దీపావళి సందర్భంగా ఈ చిత్రం నుంచి మరో సాంగ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో అదరగొడుతోన్న సంగతి తెలిసిందే. ఈ పాట అఘోరా గా ఉన్న బాలయ్య‌పై చిత్రీకరణించారు. అదిరిపోయే విజువల్స్ తోడు థమన్ కూడా అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. దీంతో ఇప్పటికే ఈ సాంగ్ ప్రోమో య్యూటూబ్‌లో మూడు మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించింది. ఇక ఈ భమ్ అఖండ పూర్తి పాటను ఈనెల 8న యూబ్యూట్‌లో విడుదలచేయనుంది చిత్రబృందం.

  ఇక మరోవైపు భారీ స్థాయిలో భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా విడుదల తేదిపై ఇంతవరకు క్లారిటీ లేదు. మొన్నటి వరకు ఈ సినిమా ఈ నవంబర్‌లో విడుదలకానుందని అన్నారు. అఖండ దీపావళి కానుకగా గర్జన ఉంటుందిని టాక్ నడిచింది. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమా డిసెంబర్ నెలకి షిఫ్ట్ అయ్యుపోయినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అఖండ క్రిస్మస్‌కు విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.


  ఇక బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం.

  ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా వస్తోంది. ఈ సినిమా అన్ని అంచనాలుకి తగ్గట్టే అదిరే బిజినెస్ ని కూడా జరుపుకుంటోందని తెలుస్తోంది. ఈ చిత్రం నైజాం హక్కులు కూడా భారీ ధర పలికినట్టు టాక్ నడుస్తోంది. నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఏకంగా 19కోట్లకు కొనుగోలు చేశారని అంటున్నారు.

  Anchor Varshini : జీన్స్ టాప్‌లో యాంకర్ వర్షిణి నడుము అందాలు.. వైరల్ అవుతోన్న పిక్స్..

  ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా మొత్తం ఆంధ్ర హక్కులు రూ. 35 కోట్ల రేషియోకు అమ్ముడయ్యాయి, ఇక సీడెడ్ రీజియన్ హక్కులు రూ .12 కోట్లకు అమ్ముడు పోయాయని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. అఖండలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది.

  ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుందని టాక్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ద్వారక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అఖండ దాదాపు పూర్తవ్వడంతో బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టారు. క్రాక్ డైరక్టర్ గోపీచంద్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. బాలయ్య గోపీచంద్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది.

  గోపిచంద్ గతంలో డాన్ శీను, బలుపు, పండగ చేస్కో లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గత సంక్రాంతికి రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ బాగా ఆకట్టుకుంది. ఈ కథలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్‌తో పాటు మరో హీరోయిన్‌గా భావన నటించనుందని తెలుస్తోంది.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Akhanda movie, Balakrishna, Boyapati Srinu, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు