హోమ్ /వార్తలు /సినిమా /

Balakrishna | Akhanda : బాలకృష్ణ అఖండ ప్రిరిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే.. అధికారిక ప్రకటన విడుదల..

Balakrishna | Akhanda : బాలకృష్ణ అఖండ ప్రిరిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే.. అధికారిక ప్రకటన విడుదల..

Akhanda Pre Release Event Photo : Twitter

Akhanda Pre Release Event Photo : Twitter

Balakrishna | Akhanda : ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో జరపాలనీ అనుకున్నట్లు నిర్ణయానికి వచ్చినట్టుగా ఒక టాక్ నడిచింది. అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల హైదరాబాద్‌లో జరపనున్నట్టు ఇటీవల వార్తలు రాగా.. వాటిని నిజం చేస్తూ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ తో కూడిన పోస్టర్‌ను వదిలింది చిత్రబృందం.

ఇంకా చదవండి ...

    నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటిస్తుండగా, తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ కాబోతుంది. దీనికి అధికారిక ప్రకటన విడుదలైంది. విడుదల తేది దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది చిత్రబృందం. అందులో భాగంగా ఇప్పటికే ఓ రెండు పాటలను విడుదల చేసిన టీమ్.. తాజాగా ట్రైలర్‌ను వదిలింది. ట్రైలర్ ఓ రేంజ్‌లో ఉందని చెప్పోచ్చు.. బాలయ్య డైలాగ్స్‌తోడు మేకోవర్ అదిరిపోయింది. దీంతో నెటిజన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నవంబర్ 14న సాయంత్రం 7:09 గంటలకు విడుదలైన సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. లైక్స్ పరంగా వ్యూస్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.

    అది అలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో జరపాలనీ అనుకున్నట్లు నిర్ణయానికి వచ్చినట్టుగా ఒక టాక్ నడిచింది. అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల హైదరాబాద్‌లో జరపనున్నట్టు ఇటీవల వార్తలు రాగా.. వాటిని నిజం చేస్తూ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ తో కూడిన పోస్టర్‌ను వదిలింది చిత్రబృందం. అందులో భాగంగా అఖండ (Akhanda Pre Release event) ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ను ఈ నెల 27వ తేదీన హైదరాబాద్‌లోని మాదాపూర్ శిల్పకళావేదికలో చిత్రబృందం నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ నెల 27న సాయంత్రం 6:30 గంటలకు మొదలుకానుంది.

    ఇక అది అలా ఉంటే ఈ సినిమా తాజాగా సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకుంది. అఖండకు U/A సర్టిఫికేట్ వచ్చినట్లు చిత్రబృందం ప్రకటించింది. అంతేకాదు రన్ టైమ్ కూడా తెలిసింది. ఈ సినిమా రెండు గంటల 47 నిమిషాల నిడివితో విడుదలకానుందని అంటున్నారు. ఇక దీపావళి సందర్భంగా ఈ చిత్రం నుంచి విడుదలైన భం అఖండ‌, భంభం అఖండ ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్‌లో పాట ఫ్యాన్స్‌కు పూనకాలనే తెస్తుందని అంటున్నారు నెటిజన్స్. థమన్ మ్యూజిక్‌తో పాటు లిరిక్స్ కూడా అదిరిపోయాయి. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. శంకర్ మహా దేవన్ పాడారు.

    బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా వస్తోంది. ఈ సినిమా అన్ని అంచనాలుకి తగ్గట్టే అదిరే బిజినెస్ ని కూడా జరుపుకుంటోందని తెలుస్తోంది. ఈ చిత్రం నైజాం హక్కులు కూడా భారీ ధర పలికినట్టు టాక్ నడుస్తోంది. నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఏకంగా 19కోట్లకు కొనుగోలు చేశారని అంటున్నారు.

    ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా మొత్తం ఆంధ్ర హక్కులు రూ. 35 కోట్ల రేషియోకు అమ్ముడయ్యాయి, ఇక సీడెడ్ రీజియన్ హక్కులు రూ .12 కోట్లకు అమ్ముడు పోయాయని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

    ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన విడుదలైంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ద్వారక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అఖండ పూర్తవ్వడంతో బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టారు. క్రాక్ డైరక్టర్ గోపీచంద్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. బాలయ్య గోపీచంద్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. త్వరలో షూటింగ్ మొదలుకానుంది. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించనుంది.

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Akhanda movie, Balakrishna, Tollywood news

    ఉత్తమ కథలు