హోమ్ /వార్తలు /సినిమా /

Balakrishna-Boyapati : ఎట్టకేలకు బాలయ్యకు హీరోయిన్ సెట్ అయ్యిందోచ్...

Balakrishna-Boyapati : ఎట్టకేలకు బాలయ్యకు హీరోయిన్ సెట్ అయ్యిందోచ్...

బాలకృష్ణ (balakrishna nandamuri)

బాలకృష్ణ (balakrishna nandamuri)

Balakrishna : నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో BB3 అనే వర్కింగ్ టైటిల్‌ పేరుతో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో BB3 అనే వర్కింగ్ టైటిల్‌ పేరుతో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగమ్మాయి అంజలితో పాటు మరో కీలక పాత్రలో శ్రియ సరన్ నటిస్తుందని రూమర్స్ వినపడ్డాయి. అయితే ఈ సినిమాలో కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని.. బోయపాటి  ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. బాలయ్య సినిమాలో హీరోయిన్ ఎవరనే టాపిక్ పై రోజుకో డిస్కషన్ నడుస్తోంది. తాజాగా అమలాపాల్ పేరు కూడా తెరపైకొచ్చింది. బాలయ్య సినిమా కోసం ఓ కొత్త హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నామని  ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా బోయపాటి.. ఎందరో హీరోయిన్ల పేర్లు పరిశీలించినా ఎవ్వరూ కుదరలేదు. బాలయ్య పక్కన ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుందని భావించిన బోయపాటి ఎంతో వెతుకులాట తర్వాత మలయాళ నటి ప్రగ్యా మార్టిన్ పేరును కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రగ్యా మార్టిన్ మలయాళంలోనే కాకుండా తమిళంలో కూడ పలు సినిమాల్లో నటించింది. తమిళంలో ఆమె మొదటి చిత్రం మిస్కిన్ దర్శకత్వంలో వచ్చిన ‘పిశాసు’. ఈ సినిమా తెలుగులో పిశాచిగా డబ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి గాను ఆమె బెస్ట్ డెబ్యూ నటిగా అవార్డ్ కూడ దక్కింది. చూడాలి మరి ఈమె అయినా ఫైనల్ అయ్యిందో లేదో..

ఇక బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. గతంలో వీరి కాంబినేషన్‌లో రెండు సినిమాలు వచ్చాయి. బోయపాటి బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో ‘లెజెండ్’.. 'సింహ'ను మించి విజయం అందుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత వస్తోన్న ఈ తాజా సినిమా ‘లెజెండ్’ను మించిన హిట్ అవ్వాలనీ బాలయ్య ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయ్యిందని.. మోనార్క్ పేరుతో ఈ సినిమా రాబోతుందని అన్నారు. అయితే తాజాగా ‘సూపర్ మ్యాన్’ అనే మరో టైటిల్ కూడా బాగా వినిపిస్తోంది. పైగా గతంలో ‘సూపర్ మ్యాన్’ అనే టైటిల్ తో ఎన్టీఆర్ సినిమా కూడా చేశారు. అంతేకాదు ఈ కథకు ‘సూపర్ మ్యాన్’ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుందట. అందుకే బోయపాటి కూడా ఈ టైటిల్ పై ఇంట్రస్ట్ గా ఉన్నాడని సమాచారం. ఇదే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. కాగా ప్రస్తుతం ప్రభుత్వం కొన్ని సడలింపులతో అనుమతులు ఇవ్వడంతో చిత్రబృందం షూటింగ్‌కు రెడీ అవుతోంది. షూటింగ్‌ను పక్కా ప్లాన్ చేసి సంక్రాంతి బరిలో ఉండాలనీ చిత్రబృందం భావిస్తోందట. తెలుగు సినిమాకి, సంక్రాంతికి వున్న సంబంధం విడదీయరానిది. ఎప్పటి నుంచో సంక్రాంతికి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుండడం మనం చూస్తున్నాం. అసలు సంక్రాంతికి తమ సినిమా విడుదల ఉండడాన్ని స్టార్ హీరోలు ప్రెస్టేజ్ గా కూడా ఫీలవుతారు. అందుకే, ఆ సమయానికి బాలయ్య తన సినిమాను రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. అందులో భాగంగా మరో వారం రోజుల్లో హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. అంతేకాదు ఈ షూటింగును సింగిల్ షెడ్యూలులో మొత్తం పూర్తి చేసేస్తారని సమాచారం. దసరాకు ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటించే అవకాశం వుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలైంది. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించునేందుకు ప్రయత్నిస్తోందట. అందులో భాగంగా స్ట్రీమింగ్ రైట్స్ కోసం అమెజాన్ సంస్థ ఏకంగా 9 నుంచి 10 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. డీల్ ఓకే అయితే.. బాలయ్య కెరీర్ లో అతిపెద్ద డిజిటల్ డీల్ ఇదే కానుంది. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఇప్పటికే సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, కేజీయఫ్ ఛాప్టర్ 2, రవితేజ క్రాక్, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఉన్నాయి. దీంతో రసవత్తరంగా సాగనుంది ఈ సారి పండుగ సీజన్.

First published:

Tags: Tollywood Movie News

ఉత్తమ కథలు