BALAKRISHNA BIRTH DAY TREAT NBK107 FIRST HUNT LOADING SLB
NBK107: సింహం వేటకు సిద్ధం.. బాలయ్య బర్త్ డే కానుకగా ఊగిపోయే అప్డేట్
Photo Twitter
NBK107: ‘అఖండ’ సక్సెస్ తర్వాత మరో మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో (Gopichand Malineni) కమిటయ్యారు బాలయ్యబాబు. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబోలో ఓ పవర్ ఫుల్ మాస్ మసాలా మూవీ సిద్ధమవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఖతర్నాక్ న్యూస్ బయటపెట్టారు మేకర్స్.
Balakrishna - Gopichanda Malineni: గతేడాది చివర్లో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ చేసిన ‘అఖండ’ (Akhanda) మూవీ సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఫుల్ జోష్‌లో ఉన్న బాలయ్య బాబు.. అదే ఉత్సాహంతో తన తదుపరి సినిమా షూటింగ్స్ చకచకా ఫినిష్ చేస్తున్నారు. ‘అఖండ’ సక్సెస్ తర్వాత మరో మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో (Gopichand Malineni) కమిటయ్యారు బాలయ్య బాబు. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబోలో ఓ పవర్ ఫుల్ మాస్ మసాలా మూవీ సిద్ధమవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఖతర్నాక్ న్యూస్ బయటపెట్టారు మేకర్స్.
సింహం వేటకు సిద్ధం.. అని పేర్కొంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ మీటిన మైత్రి మూవీ మేకర్స్ NBK107 ఫస్ట్ హంట్ లోడింగ్ అంటూ నందమూరి అభిమానులకు కిక్కిచ్చే అప్డేట్ ఇచ్చారు. దీన్నిబట్టి చూస్తే జూన్ 10వ తేదీన బాలయ్య బాబు పుట్టినరోజు (Balakrishna Birthday) కానుకగా ఈ ఫస్ట్ హంట్ (NBK First Hunt) ప్రేక్షకుల ముందుంచబోతున్నారని స్పష్టమవుతోంది. మరో మూడు రోజుల్లో తన 62వ బర్త్ డే చేసుకోబోతున్నారు బాలకృష్ణ. ఈ నేపథ్యంలోనే NBK 107 క్రేజీ అప్డేట్ ఒకటుంటుందని చెప్పి నందమూరి అభిమానుల్లో జోష్ నింపారు మేకర్స్.
మాస్ అంశాలు పుష్కలంగా ఉండేలా ఈ సినిమా కథ రాసుకున్నారట గోపీచంద్ మలినేని. ఈ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఖర్చు విషయంలో మైత్రి మేకర్స్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదని సమాచారం. బాలయ్య కెరీర్ లోనే ఈ సినిమా ప్రత్యేకంగా నిలవాలని భావిస్తున్నారట. ఇకపోతే ఈ సినిమాలో శృతిహాసన్ (Shruthi haasan)హీరోయిన్గా నటిస్తుండగా మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
Simham veta ki sidham 🔥#NBK107 First Hunt Loading 💥💥
— Mythri Movie Makers (@MythriOfficial) June 7, 2022
కాగా ఈ చిత్రానికి జై బాలయ్య అనే పేరు ఖరారు చేశారని, త్వరలోనే అధికారికంగా కన్ఫర్మేషన్ రానుందని అంటున్నారు. ఈ టైటిల్ విని నందమూరి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కేక పెట్టించనున్నారని సమాచారం. అలాగే ఓ మాస్ ఐటెం సాంగ్ ప్లాన్ చేసిన యూనిట్.. ఇందుకోసం డింపుల్ హయతిని ఎంపిక చేసుకున్నారని టాక్. సో.. చూడాలి మరి NBK107 ఫస్ట్ హంట్ బర్త్ డేకి ముందే వదులుతారో లేక బర్త్ డే రోజే వదులుతారో అనేది.
Published by:Sunil Boddula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.