Home /News /movies /

BALAKRISHNA ANIL RAVIPUDI MOVIE ALL SET TO GOING TO SEPTEMBER THIS YEAR TA

Balakrishna - Anil Ravipudi : బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమాకు అంతా సిద్ధం.. సెట్స్ పైకి వెళ్లే టైమ్ ఫిక్స్..

బాలకృష్ణ,అనిల్ రావిపూడి (Twitter/Photo)

బాలకృష్ణ,అనిల్ రావిపూడి (Twitter/Photo)

Balakrishna - Anil Ravipudi : బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమాకు అంతా సిద్ధమైందా.. త్వరలో పూజా కార్యక్రమాలతో సెట్స్ పైకి వెళ్లే ముహూర్తం ఖరారైనట్టు సమాచారం.

    Balakrishna - Anil Ravipudi : అఖండ’తో భారీ సక్సెస్‌ను అందుకున్న బాలయ్య.. నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌ను గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి క్రేజీ డైరెక్టర్స్‌తో చేయడానికి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఒకవైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలు.. అది కాకుండా..  బాలకృష్ణ ఎవరు ఊహించని విధంగా మెగా ఫ్యామిలీకి చెందిన ‘ఆహా’ ఓటీటీకి హోస్ట్‌గా చేయడానికి ఓకే చెప్పడం ఎవరు ఊహించి ఉండరు. అంతేకాదు హోస్ట్‌గా బాలయ్య ఈ షోను సక్సెస్ చేసిన విధానం కూడా అందరినీ ఆకట్టుకుంది. గతేడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ సక్సెస్‌ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యంతో వరుసగా క్రేజీ డైరెక్టర్స్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.

    రెండో షెడ్యూల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు చివరి వారం వరకు కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు బాలయ్య. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు.   ఈ సినిమాను టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా సత్తా చూపెడుతున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య ఫ్యాక్షనిస్ట్‌ పాత్రతో పాటు పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నట్టు సమాచారం.ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు.

    Ram Charan : రియల్ హీరోలతో రామ్ చరణ్.. దేశ సైనికులతో మెగా పవర్ స్టార్ రచ్చ..

    ఇప్పటికే అనిల్ రావిపూడి బాలయ్య ఇమేజ్‌కు తగ్గ స్టోరీని రెడీ చేసి ఒప్పించారు. ఈ సినిమా కూడా అనిల్ స్టైల్లో సాగే యాక్షన్ ఎంటర్టేనర్‌ అని చెబుతున్నారు. ఈ చిత్రంలో రవితేజ కూడా మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. అయితే ఇంతకు ముందోసారి కూడా అప్పట్లో బాలకృష్ణ 100వ సినిమా సమయంలోనే ఆయనకి అనిల్ రావిపూడి ఒక కథను వినిపించాడట. అప్పట్లో ఈ కాంబినేషన్ సెట్ కాలేదు. కానీ అనిల్ రావిపూడి అదే కథను కొన్ని మార్పులతో బాలయ్యను ఒప్పించినట్టు సమాచారం. హీరోగా బాలయ్యకు ఇది 108 చిత్రం.

    Balakrishna - Roja : మంత్రి అయిన తర్వాత బాలకృష్ణ పై అలాంటి వ్యాఖ్యలు చేసిన రోజా..


    ఈ చిత్రంలో బాలయ్య సరసన తన ఆస్థాన కథానాయికలైన తమన్నా, మెహ్రీన్‌ కౌర్‌‌ను ఎంపిక చేసారట.  ఇక ఈ చిత్రాన్నిషైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ వినాయక చవితి కానుకగా మొదలు పెట్టి సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట.  ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన జూన్ 10 బాలయ్య పుట్టినరోజున ప్రకటించే అవకాశం ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Anil Ravipudi, Balakrishna, NBK, NBK 107, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు