హరికృష్ణ చనిపోయిన తర్వాత నందమూరి కుటుంబం మళ్లీ కలిసిపోయింది. ఏడేళ్లుగా మాట్లాడుకోని బాలయ్య, కళ్యాణ్ రామ్ కుటుంబాలు మళ్లీ కలిసిపోయాయి. ఇప్పుడు నాన్న లేని జూనియర్, కళ్యాణ్ రామ్ కు తానే నాన్నలా మారిపోయాడు బాలయ్య. పిల్లలకు పెద్దదిక్కుగా ఉన్నాడు. ఆ మధ్య బాలయ్య నటించిన కథానాయకుడు సినిమా ఆడియో వేడుకకు జూనియర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ వచ్చారు. దానికి ముందు అరవింద సమేత సక్సెస్ మీట్ కు బాలయ్య వచ్చాడు. ఇక ఇప్పుడు మూడోసారి ఈ విచిత్రం జరుగుతుంది.
ఫిబ్రవరి 25న జరగబోయే ‘118’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు బాలకృష్ణ , జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధులుగా వస్తున్నారు. ఈ మధ్య నందమూరి కుటుంబం అంతా కలిసుందాం రా అంటూ పాటలు పాడుకుంటున్నారు. ఈ మధ్య వరసగా నందమూరి వారసులు అంతా కలిసి ఒకే స్టేజ్ మీద కలిసి కనిపిస్తున్నారు.
ఫిబ్రవరి 25న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ జెఆర్సీ కన్వెన్షన్ లో జరుగనుంది. కేవీ గుహన్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చ్ 1న విడుదల కానుంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది. నివేద థామస్, శాలిని పాండే హీరోయిన్లుగా నటించారు. పటాస్ తర్వాత హిట్ లేని కళ్యాణ్ రామ్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. చూడాలిక.. ఏం జరుగుతుందో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Jr ntr, Kalyan Ram Nandamuri, Shalini Pandey, Telugu Cinema, Tollywood