హోమ్ /వార్తలు /సినిమా /

నేను మోనార్క్‌ను అంటోన్న బాలయ్య.. బోయపాటి లెక్క అదిరిందిగా..

నేను మోనార్క్‌ను అంటోన్న బాలయ్య.. బోయపాటి లెక్క అదిరిందిగా..

అందులో ఒకటి అఘోరా పాత్ర కూడా. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఎమ్మెల్యే పాత్ర కూడా ఒకటి ఉంది. అది బాలయ్య చేయడం లేదు కానీ మరో యంగ్ హీరోకి ఇచ్చేసాడు. అతడే నవీన్ చంద్ర.

అందులో ఒకటి అఘోరా పాత్ర కూడా. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఎమ్మెల్యే పాత్ర కూడా ఒకటి ఉంది. అది బాలయ్య చేయడం లేదు కానీ మరో యంగ్ హీరోకి ఇచ్చేసాడు. అతడే నవీన్ చంద్ర.

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

    బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రెండు సినిమాలు రాగా ఇది మూడో సినిమా. బోయపాటి బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో ‘లెజెండ్’ వచ్చిన సింహను మించి విజయం అందుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత వస్తోన్న ఈ తాజా సినిమా ‘లెజెండ్’ను మించిన హిట్ అవ్వాలనీ బాలయ్య ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అది అలా ఉంటేఈ సినిమా మొదలైప్పటి నుండి రకరకాల వార్తలు వస్తున్నాయి. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ అనే సినిమాతో హీరోగా పరిచయమైన నవీన్‌ పొలిశెట్టి ఈ సినిమాలో హీరో కీలక పాత్రలో నటిస్తున్నాడని ఆ మధ్య ఓ వార్త చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తల్నీ నవీన్ కొట్టేపారేశాడు. తాను బాలయ్య సినిమాలో నటించట్లేదని స్పష్టం చేశాడు. ఇక తాజాగా మరో వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయ్యిందట. మోనార్క్ పేరుతో ఈ సినిమా రాబోతోందని తాజా సమాచారం. ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ గురించి కూడా రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగమ్మాయి అంజలితో పాటు మరో కీలక పాత్రలో శ్రియ సరన్ నటిస్తుందని రూమర్స్ వినపడ్డాయి. అయితే ఈ సినిమాలో కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని.. బోయపాటి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. దీంతో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ కనిపించనుందని క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. ఇక ఈ సినిమా కొంత షూటింగ్ జరుపుకోగా.. కరోనా వల్ల ఏర్పడ్డ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Bala Krishna, Boyapati Srinu, Tollywood news

    ఉత్తమ కథలు