బాలకృష్ణ, బోయపాటి శ్రీను కొత్త సినిమా ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులకు పండగే. గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘లెజెండ్’ మూవీ కూడా బాలయ్యకు అదిరిపోయే విజయాన్ని అందించింది. ఈ కాంబినేషన్లో తాజాగా వస్తోన్న ఈ చిత్రాన్ని చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అందులో భాగంగా చిత్రానికి బాలీవుడ్ హంగులు అద్దే ప్రయత్నంలో చిత్రబృందం. ముఖ్యంగా బాలయ్యకు సరితూగే విలన్ పాత్రకోసం బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌ను తీసుకోవాలని చూస్తున్నారట. అంతేకాదు హీరోయిన్గా సొనాక్షి సిన్హాను తీసుకోవాలని భావిస్తున్నారట. దీనికోసం ప్రయత్నాలు కూడా స్టార్ట్ అయ్యాయని తెలుస్తోంది. ఈ ప్రయత్నాలన్నీ ఫలిస్తే బాలయ్య సినిమాలో బాలీవుడ్ మెరుపులు భారీగా ఉండే అవకాశం ఉంది. తెలుగు సినిమాల్లో హిందీ నటులు నటించడం వలన సినిమా హిందీ డబ్బింగ్, యూట్యూబ్ రైట్స్ కూడా మంచి ధరకు అమ్ముడయ్యే అవకాశం ఉంటుంది. పాయల్ హాట్ పిక్స్...
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.