హోమ్ /వార్తలు /సినిమా /

BalaKrishna: 2024 ఎన్నికలే టార్గెట్... బాలయ్య బోయపాటి కొత్త సినిమా

BalaKrishna: 2024 ఎన్నికలే టార్గెట్... బాలయ్య బోయపాటి కొత్త సినిమా

బోయపాటి డైరెక్షన్‌లో మరోసారి బాలయ్య

బోయపాటి డైరెక్షన్‌లో మరోసారి బాలయ్య

ఈ సారి బాలయ్య మూవీ అఖండ టైప్‌లో కాకుండా, పొలిటికల్ టచ్ ఉన్న స్టోరీని బోయపాటి బాలయ్యతో ఈసారి చేయనున్నట్లు తెలుస్తోంది.

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ అభిమానులందరకీ బాలయ్య బాబు గురించి తెలిసిందే. అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు చేసుకుంటూ బాలయ్య దూసుకెళ్తున్నాడు. బాలకృష్ణ చాలామంది డైరెక్టర్లతో కలిసి పనిచేశారు. అయితే బోయపాటి శీను డైరెక్షన్‌లో బాలయ్య సినిమా అంటే నందమూరి ఫ్యాన్స్‌లో ఒకరకమైన వైబ్రేషన్స్ మొదలవుతాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన కాంబినేషన్ బాలకృష్ణ, బోయపాటి శ్రీను. వీరిద్దరు జత కట్టారంటే సినిమా హిట్ అవ్వాల్సిందే. గత 11 ఏళ్లలో 3 బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చింది ఈ కాంబినేషన్. అది కూడా బాలకృష్ణ వరస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు అదిరిపోయే హిట్ ఇచ్చాడు బోయపాటి శ్రీను. అందుకే ఈ కాంబినేషన్‌లో సినిమా అంటే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం.

గతేడాది ఇద్దరూ కలిసి చేసిన అఖండ సినిమా ఎలాంటి సంచలనం సృష్టించింది అందరికీ తెలిసిందే. కరోనా టైంలో కూడా ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. 75 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి తెలుగు ఇండస్ట్రీకి ఊపిరిపోసింది అఖండ. అంతేకాదు బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది అఖండ. దీనికి ముందు లెజెండ్, సింహా సినిమాలతో కూడా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసింది బోయపాటి, బాలయ్య కాంబినేషన్. ఇలాంటి బ్లాక్ బస్టర్ జోడీ మరోసారి కలిసి పని చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక బాలయ్య,బోయపాటి కాంబినేషన్‌ అంటే.. ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే. అందుకే ఈ కాంబినేషన్‌లో సినిమా కోసం కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆసక్తిగా వేచి చూస్తుంటారు. అయితే ఈసారి బాలయ్యతో బోయపాటి సినిమా పొలిటికిల్ హీట్ పుట్టించనున్నట్లు తెలుస్తోంది. అఖండ తరహాలో కాకుండా లెజెండ్ మాదిరి పొలిటికల్ టచ్ ఉన్న కథ అని తెలుస్తోంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడిలతో సినిమాలతో బాలకృష్ణ బిజీగా ఉన్నాడు. మరోవైపు బోయపాటి శ్రీను కూడా రామ్ పోతినేని హీరోగా ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. ఈ కమిట్‌మెంట్స్‌ పూర్తయిన తర్వాత బోయపాటి, బాలయ్య నాలుగో సినిమా మొదలు కానుంది.

First published:

Tags: Akhanda movie, Bala Krishna, Bala Krishna Nandamuri, Boyapati Srinu

ఉత్తమ కథలు