హోమ్ /వార్తలు /సినిమా /

Balakrishna : బాలయ్యకు కరోనా కష్టాలు.. చేతులెత్తేసిన చిత్ర బృందం..

Balakrishna : బాలయ్యకు కరోనా కష్టాలు.. చేతులెత్తేసిన చిత్ర బృందం..

ఇదిలా ఉంటే ఇప్పుడు మాత్రం డేంజర్ అనే టైటిల్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. 2005లో కృష్ణవంశీ దర్శకత్వంలో ఇదే టైటిల్‌తో ఓ సినిమా వచ్చింది. కానీ సినిమా వచ్చి పదేళ్లు దాటిపోవడంతో ఈ టైటిల్ మరో సినిమాకు పెట్టుకోవచ్చు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మాత్రం డేంజర్ అనే టైటిల్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. 2005లో కృష్ణవంశీ దర్శకత్వంలో ఇదే టైటిల్‌తో ఓ సినిమా వచ్చింది. కానీ సినిమా వచ్చి పదేళ్లు దాటిపోవడంతో ఈ టైటిల్ మరో సినిమాకు పెట్టుకోవచ్చు.

Balakrishna : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో BB3 అనే వర్కింగ్ టైటిల్‌‌తో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.

  నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో BB3 అనే వర్కింగ్ టైటిల్‌‌తో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా. గతంలో వీరి కాంబినేషన్‌లో రెండు సినిమాలు వచ్చాయి. బోయపాటి బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో ‘లెజెండ్’.. 'సింహ'ను మించి విజయం అందుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత వస్తోన్న ఈ తాజా సినిమా ‘లెజెండ్’ను మించిన హిట్ అవ్వాలనీ బాలయ్య ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయ్యిందని.. మోనార్క్ పేరుతో ఈ సినిమా రాబోతుందని అన్నారు. అయితే తాజాగా ‘సూపర్ మ్యాన్’ అనే మరో టైటిల్ కూడా బాగా వినిపిస్తోంది. పైగా గతంలో ‘సూపర్ మ్యాన్’ అనే టైటిల్ తో ఎన్టీఆర్ సినిమా కూడా చేశారు. అంతేకాదు ఈ కథకు ‘సూపర్ మ్యాన్’ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుందట. అందుకే బోయపాటి కూడా ఈ టైటిల్ పై ఇంట్రస్ట్ గా ఉన్నాడని సమాచారం. ఇదే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

  balakrishna and boyapati bb3, balakrishna as super man, Balakrishna Monarch, Boyapati Srinu, Naveen polishetty, balakrishna and boyapati film, boyapati film, balakrishna films, బోయపాటి సినిమాలు,బాలయ్య సినిమాలు, నవీ, న్ పొలిశెట్టి, తెలుగు సినిమా వార్తలు,
  బాలకృష్ణ Photo : Twitter

  ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగమ్మాయి అంజలితో పాటు మరో కీలక పాత్రలో శ్రియ సరన్ నటిస్తుందని రూమర్స్ వినపడ్డాయి. అయితే ఈ సినిమాలో కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని.. బోయపాటి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. బాలయ్య సినిమా కోసం ఓ కొత్త హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నామని ఇప్పటికే ప్రకటించిన బోయపాటి.. అదే మాటకు కట్టుబడి ఉన్నాడట. అంతేకాదు కొత్త హీరోయిన్ సెలక్షన్ ప్రాసెస్ కూడా పూర్తయిందట. ఒక అందమైన మోడల్ బాలకృష్ణ సరసన నటించనుందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుంది. ఇక అది అలా ఉంటే.. కరోనా మహమ్మారి దెబ్బకు సినీ ఇండస్ట్రీ స్తంభించిపోయింది. కరోనా దాటికి చిత్రనిర్మాతలు అవుట్ డోర్ షెడ్యూల్స్ ను, విదేశీ షెడ్యూల్‌లను రద్దు చేసుకున్నారు. అందులో భాగంగా బాలయ్య సినిమాలో కూడా ఓ అవుట్ డోర్ షెడ్యూల్ రద్దైనట్లు తెలుస్తోంది.

  balakrishna and boyapati bb3, balakrishna as super man, Balakrishna Monarch, Boyapati Srinu, Naveen polishetty, balakrishna and boyapati film, boyapati film, balakrishna films, బోయపాటి సినిమాలు,బాలయ్య సినిమాలు, నవీ, న్ పొలిశెట్టి, తెలుగు సినిమా వార్తలు,
  బాలయ్య Photo : Twitter

  ఈ సినిమాలో ఓ ముఖ్యమైన సీక్వెన్స్ ను వారణాసితో పాటు హిమాలయాల్లో విస్తృతంగా షూట్ చేయాల్సి ఉందట. అయితే అంత మొత్తంలో స్టూడియోల్లో సెట్ వేయడం సాధ్యం కాక పోవడంతో పూర్తిగా ఆ సీక్వెన్స్ ను స్క్రిప్ట్ నుండి తీసేశారని తాజా సమాచారం. ఇక ఈ సినిమాలో యంగ్ హీరో నవీన్ చంద్ర ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇటీవల బానుమతి అండ్ రామకృష్ణ సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన నవీన్ చంద్ర మంచి పాత్రలను పోషించనున్నాడట. నవీన్ గతంలో ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Balakrishna, Balayya, Boyapati Srinu

  ఉత్తమ కథలు