హోమ్ /వార్తలు /సినిమా /

బాలయ్య సినిమాకు ఆకస్తికర టైటిల్.. మోనార్క్ కాదట..

బాలయ్య సినిమాకు ఆకస్తికర టైటిల్.. మోనార్క్ కాదట..

బాలకృష్ణ Photo : Twitter

బాలకృష్ణ Photo : Twitter

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో BB3 అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

  నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రెండు సినిమాలు రాగా ఇది మూడో సినిమా. బోయపాటి బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో ‘లెజెండ్’ వచ్చిన 'సింహ'ను మించి విజయం అందుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత వస్తోన్న ఈ తాజా సినిమా ‘లెజెండ్’ను మించిన హిట్ అవ్వాలనీ బాలయ్య ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అది అలా ఉంటేఈ సినిమా మొదలైప్పటి నుండి రకరకాల వార్తలు వస్తున్నాయి. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ అనే సినిమాతో హీరోగా పరిచయమైన నవీన్‌ పొలిశెట్టి ఈ సినిమాలో హీరో కీలక పాత్రలో నటిస్తున్నాడని ఆ మధ్య ఓ వార్త చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తల్నీ నవీన్ కొట్టేపారేశాడు. తాను బాలయ్య సినిమాలో నటించట్లేదని స్పష్టం చేశాడు. ఇక ఇటీవల మరో వార్త హల్ చల్ చేసింది. ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయ్యిందని.. మోనార్క్ పేరుతో ఈ సినిమా రాబోతోందని ఆ వార్త సారాంశం. అయితే తాజాగా ‘సూపర్ మ్యాన్’ అనే మరో టైటిల్ కూడా బాగా వినిపిస్తోంది. పైగా గతంలో ‘సూపర్ మ్యాన్’ అనే టైటిల్ తో ఎన్టీఆర్ సినిమా కూడా చేశారు. అంతేకాదు ఈ కథకు ‘సూపర్ మ్యాన్’ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుందట. అందుకే బోయపాటి కూడా ఈ టైటిల్ పై ఇంట్రస్ట్ గా ఉన్నాడని సమాచారం. ఇదే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబందించి టైటిల్‌‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

  ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ గురించి కూడా రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగమ్మాయి అంజలితో పాటు మరో కీలక పాత్రలో శ్రియ సరన్ నటిస్తుందని రూమర్స్ వినపడ్డాయి. అయితే ఈ సినిమాలో కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని.. బోయపాటి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. దీంతో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ కనిపించనుందని క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. ఇక ఈ సినిమా కొంత షూటింగ్ జరుపుకోగా.. కరోనా వల్ల ఏర్పడ్డ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Balakrishna, Boyapati Srinu, Tollywood news

  ఉత్తమ కథలు