బాలకృష్ణ హీరోగా అల్లు అరవింద్ భారీ చిత్రం (Twitter/Photo)
BalaKrishna - Allu Aravind : మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్‌లో బాలకృష్ణ హీరోగా, మోహన్ బాబు విలన్‌గా భారీ చిత్రానికి రంగం సిద్ధమైందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు.
BalaKrishna - Allu Aravind : మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్‌లో బాలకృష్ణ హీరోగా, మోహన్ బాబు విలన్‌గా భారీ చిత్రానికి రంగం సిద్ధమైందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. అల్లు అరవింద్ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ఉంటూనే ఆహా ఓటీటీ అంటూ తెలుగు కంటెంట్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కదా. తన కాంపౌండ్‌లో చిరంజీవి సహా ఎంతో మంది మెగా హీరోలన్న వాళ్లను కాదని..ఎవరు కలలో ఊహించని విధంగా బాలయ్య హోస్ట్‌గా ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ అంటూ ఓ టాక్ షోను ప్లాన్ చేయడమే కాదు. ఈ టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్‌కు మెగా ఫ్యామిలీకి ‘మా’ ఎలక్షన్స్ సందర్భంగా సవాల్ విసిరిన మోహన్ బాబు ఫస్ట్ గెస్ట్‌గా వచ్చేలా చేయడంలో సక్సెస్ సాధించారు అల్లు అరవింద్. ఈ షోకు మంచు లక్ష్మీ, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. ఇక టాక్ షోకు బాలకృష్ణ యాంకర్ అనడంతో ఆయన అభిమానులు మురిసిపోతున్నారు.
సినీ ప్రియులు సైతం కొత్త క్యారెక్టర్లో బాలకృష్ణ ఏ రకంగా మెప్పిస్తారని ఎదురుచూసారు. పైగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ అతిథిగా రావడం మరింత ఆసక్తికరంగా మారింది. దీపావళి సందర్భంగా ప్రసారమైన ఈ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బాలయ్య హోస్ట్‌గా మోహన్ బాబు గెస్ట్‌గా ఈ షో కెవ్వుకేక పుట్టిచ్చిందని సోషల్ మీడియాలో అందరు చెప్పుకుంటున్నారు.
ముఖ్యంగా బాలయ్య.. మోహన్‌బాబును కాస్త ఇబ్బందికర ప్రశ్నలనే అడిగారు. దానికి మోహన్ బాబు అంతే ఒడుపుగా సమాధానాలు ఇవ్వడంతో పాటు బాలయ్యను తిరిగి తనదైన ప్రశ్నలతో ఒకింత ఉక్కిరి బిక్కిరి చేసి షోను కాక పుట్టించారు. తాజాగా బాలయ్యతో ఎవరు ఊహించని విధంగా ‘ఆహా’ టాక్ షోకు హోస్ట్‌గా ఒప్పించిన అల్లు అరవింద్.. తన ఓన్ బ్యానర్ గీతా ఆర్ట్స్‌లో బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ భారీ సినిమాకు ప్లాన్ చేసినట్టు సమాచారం.
ఇప్పటికే క్రిష్.. ఓ కథను రెడీ చేసుకున్నారట. ఇప్పటికే క్రిష్. .గీతా ఆర్ట్స్‌కు ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. మరోవైపు అల్లు అరవింద్.. తాజాగా బాలయ్య నెక్ట్స్ సినిమాకు సంబంధించిన డేట్స్‌ను సంపాదించారట. ఈ రకంగా బాలయ్య హీరోగా క్రిష్ దర్శకత్వంలో మోహన్ బాబు విలన్‌గా అల్లు అరవింద్ ఈ సినిమాను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
త్వరలో గీతా ఆర్ట్స్‌లో బాలయ్య హీరోగా మోహన్ బాబు విలన్‌గా క్రిష్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాతగా సినిమాను అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నిర్మాత ఇపుడు అది కూడా మెగా హీరోలకు మెయిన్ కాంపీటీటర్ అయిన నందమూరి హీరోతో సినిమా అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు పెరగడం ఖాయం అనే చెప్పాలి. ఇప్పటి వరకు గీతా ఆర్ట్స్‌లో అక్కినేని హీరోలైన ‘ఏఎన్నార్, నాగ చైతన్య, రీసెంట్గా అఖిల్ నటించారు. కానీ నందమూరి హీరోలెవరు ఈ బ్యానర్లో నటించలేదు.
ఇపుడు బాలయ్య హీరోగా అల్లు అరవింద్ సినిమా తీసి నందమూరి హీరోలతో సినిమా తీయలేదన్న లోటును పూరించుకోనున్నారు. ఏమైనా టాలీవుడ్లో బాలయ్యను హోస్ట్ చేసిన అల్లు అరవింద్ ఆయన హీరోగా సినిమా చేస్తే ఏ రేంజ్లో ఉంటుందనేది చూడాల్సిందే.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.