Home /News /movies /

BALAKRISHNA AKHANDA TWENTY THREE DAYS COLLECTIONS HERE ARE THE DETAILS SR

Balakrishna | Akhanda : అఖండ 23 రోజుల కలెక్షన్స్... తగ్గని బాలయ్య.. అదే జోరు..

Akhanda Photo : Twitter

Akhanda Photo : Twitter

Balakrishna | Akhanda : నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు.

ఇంకా చదవండి ...
    నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. అంచనాలను మించి దుమ్ము లేపుతోంది అఖండ. ఈ సినిమా పదిరోజుల్లో 100 కోట్ల క్లబ్‌కి చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాలను పూర్తీ చేసుకుని ఇప్పుడు నాలుగో వారంలో అడుగు పెట్టింది. అంతేకాదు తాజాగా పోటిగా వచ్చిన పుష్పతో పాటు శ్యామ్ సింగ రాయ్‌తో కూడా పోటి పడుతూ మంచి వసూళ్ళనే సొంతం చేసుకుంటోంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 23 వ రోజు 19 లక్షల షేర్ ని సాధించింది.

    టోటల్ వరల్డ్ వైడ్ అఖండ కలెక్షన్స్...

    Nizam: 19.36Cr
    Ceeded: 14.69Cr
    UA: 6.00Cr
    East: 4.02Cr
    West: 3.91Cr
    Guntur: 4.58Cr
    Krishna: 3.48Cr
    Nellore: 2.52Cr
    AP-TG Total:- 58.56CR(96.25CR~ Gross)
    Ka+ROI: 4.87Cr
    OS – 5.63Cr
    Total WW: 69.06CR(121.50CR~ Gross)

    ఈ సినిమా టోటల్ టార్గెట్ 54 కోట్లు కాగా మొత్తం మీద 15.06 కోట్ల ప్రాఫిట్‌తో దూసుకుపోతోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్‌ ఓ రేంజ్‌లో అమ్ముడు పోయాయని తెలుస్తోంది. అఖండ హిందీ డబ్బింగ్ హక్కులను ప్రముఖ పంపిణీ సంస్థకు విక్రయించింది చిత్రబృందం. కేవలం హిందీ డబ్బింగ్ రైట్స్ నుంచి రూ. 20 కోట్లను అందాయని అంటున్నారు. మరోవైపు ఈ సినిమాను హిందీలో రీమేక్ కూడా చేస్తున్నారని.. ఈ రీమేక్‌లో అక్షయ్ లేదా అజయ్ దేవగన్ నటిస్తారని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

    Keerthy Suresh : కీర్తి సురేష్ క్రిస్మస్ సంబరాలు.. పిక్స్ వైరల్..

    బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రం కూడా మంచి విజయం దక్కించుకుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన విడుదలైంది. థమన్ సంగీతం అందించారు. ఈ సినిమాను ద్వారక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఇక అఖండ పూర్తవ్వడంతో బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టారు.

    క్రాక్ డైరక్టర్ గోపీచంద్‌  (Gopichand)దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. బాలయ్య గోపీచంద్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. త్వరలో షూటింగ్ మొదలుకానుంది. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించనుంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Akhanda movie, Balakrishna, Boyapati Srinu, Tollywood news

    తదుపరి వార్తలు