Balakrishna | Akhanda : నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటించారు.
నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. అంచనాలను మించి దుమ్ము లేపుతోంది అఖండ. ఈ సినిమా పదిరోజుల్లో 100 కోట్ల క్లబ్‌కి చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. బాలయ్య అఖండ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర 5 వ వారంలోకి అడుగు పెట్టింది. అయితే ఐదవవారంలో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది అఖండ. ఈ సినిమా 29వ రోజు 11 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా 30 వ రోజుకి 10 లక్షల వరకు షేర్ని సొంతం రాబట్టింది.
అఖండ 30 రోజుల టోటల్ కలెక్షన్స్‌ను చూస్తే..
Nizam: 19.93Cr
Ceeded: 15.09Cr
UA: 6.13Cr
East: 4.11Cr
West: 4.06Cr
Guntur: 4.68Cr
Krishna: 3.56Cr
Nellore: 2.58Cr
AP-TG Total : 60.14CR(99.36CR Gross)
Ka+ROI: 5.00Cr
OS – 5.68Cr
Total WW: 70.82CR(124.85CR Gross)
ఈ సినిమా టోటల్ టార్గెట్ 54 కోట్లు కాగా మొత్తం మీద 16.82 కోట్ల ప్రాఫిట్ దూసుకుపోతోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ ఓ రేంజ్లో అమ్ముడు పోయాయని తెలుస్తోంది. అఖండ హిందీ డబ్బింగ్ హక్కులను ప్రముఖ పంపిణీ సంస్థకు విక్రయించింది చిత్రబృందం. కేవలం హిందీ డబ్బింగ్ రైట్స్ నుంచి రూ. 20 కోట్లను అందాయని అంటున్నారు. మరోవైపు ఈ సినిమాను హిందీలో రీమేక్ కూడా చేస్తున్నారని.. ఈ రీమేక్‌లో అక్షయ్ లేదా అజయ్ దేవగన్ నటిస్తారని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రం కూడా మంచి విజయం దక్కించుకుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన విడుదలైంది. థమన్ సంగీతం అందించారు. ఈ సినిమాను ద్వారక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఇక అఖండ పూర్తవ్వడంతో బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టారు.
క్రాక్ డైరక్టర్ గోపీచంద్ (Gopichand)దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. బాలయ్య గోపీచంద్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. త్వరలో షూటింగ్ మొదలుకానుంది. శృతి హాసన్ హీరోయిన్గా నటించనుంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.