• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BALAKRISHNA AKHANDA TEASER BREAKS CHIRANJEEVI ACHARYA RECORD IN YOUTUBE NR

Balakrishna Akhanda: చిరంజీవి రికార్డు బ్రేక్ చేసిన బాలయ్య.. ఎందులో అంటే?

Balakrishna Akhanda: చిరంజీవి రికార్డు బ్రేక్ చేసిన బాలయ్య.. ఎందులో అంటే?

bala krishna

Balakrishna Akhanda: నటసింహ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. సీనియర్ ఎన్టీఆర్ కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినా తన స్టైల్ తో తక్కువ సమయంలోనే తనకంటూ

  • Share this:
    Balakrishna Akhanda: నటసింహ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. సీనియర్ ఎన్టీఆర్ కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినా తన స్టైల్ తో తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు బాలయ్య. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలు సొంతం చేసుకున్న బాలయ్య 2000 సమయంలో ఫ్యాక్షనిజంపై సినిమాలపై సినిమాలు చేసి లెక్కలేనంతమంది మాస్ అభిమానులను సొంతం చేసుకున్నాడు.

    ఎన్నో అద్భుతమైన రికార్డులను బ్రేక్ చేశాడు బాలయ్య. ఇక ఈ నేపథ్యంలోనే బాలయ్య అఖండ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చెయ్యగా యూట్యూబ్ లో అరాచకం సృష్టిస్తుంది. దానికి ఫలితంగా ఏకంగా చిరంజీవి సృష్టించిన నెంబర్ 1 రికార్డును బద్దలు కొట్టాడు బాలయ్య.

    గతంలో ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ వీడియోకు నెలకు ఏడు మిలియన్ వ్యూస్ వచ్చాయ్. ఆతర్వాత వచ్చిన 'భీమ్ ఫర్ రామరాజు' టీజర్ కు కూడా నెలలో 12 మిలియన్ వ్యూస్ వచ్చాయ్. అయితే బాలయ్య అఖండ టీజర్ కు మాత్రం కేవలం 25 గంటల్లోనే 12 మిలియన్ వ్యూస్ దక్కాయ్. అయితే నిజానికి మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఆచార్య కొన్ని రోజుల క్రితం విడుదల కాగా ఇప్పటి వరకు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయ్. అయితే బాలయ్య టీజర్ కి ఏకంగా ఐదు రోజుల్లో 25 మిలియన్ వ్యూస్ రావడంతో గతంలో అందరి హీరోల రికార్డులను ఒక్క సినిమా టీజర్ తో బద్దలు కొట్టాడు బాలయ్య. బోయపాటి దర్శకతంలో బాలయ్య నటిస్తున్నాడు అంటేనే రికార్డు బ్రేక్ చెయ్యడం అనేది మరోసారి ప్రూవ్ చేశారు .
    Published by:Navya Reddy
    First published: