హోమ్ /వార్తలు /సినిమా /

Balakrishna | Akhanda : అఖండ రెండో రోజు కలెక్షన్స్.. మాస్ జాతర.. అక్కడ అప్పుడే ఫ్రాఫిట్స్..

Balakrishna | Akhanda : అఖండ రెండో రోజు కలెక్షన్స్.. మాస్ జాతర.. అక్కడ అప్పుడే ఫ్రాఫిట్స్..

Akhanda Photo : Twitter

Akhanda Photo : Twitter

Balakrishna | Akhanda Collections : భారీ అంచనాల నడుమ ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. అంచనాలను మించి మొదటి రోజు దుమ్ము లేపిన అఖండ రెండో రోజు కూడా మంచి హోల్డ్ నే సొంతం చేసుకుంది.

  నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. అంచనాలను మించి మొదటి రోజు దుమ్ము లేపిన అఖండ రెండో రోజు కూడా మంచి హోల్డ్ నే సొంతం చేసుకుంది. సినిమా మొదటి రోజు వర్త్ షేర్ 13 కోట్ల రేంజ్‌లో ఉండగా రెండో రోజు కుమ్మింది. మొత్తం మీద రెండో రోజు తెలుగు రాష్ట్రలలో అఖండ 6-6.5 కోట్ల రేంజ్‌లో కలెక్షన్స్ ని అందుకుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

  ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే.. అఖండ సినిమాను ఓవర్సీస్ మొత్తం మీద 2.5 కోట్ల రేటుకి అమ్మగా ప్రీమియర్స్ అండ్ ఫస్ట్ డే కలెక్షన్స్2తో ఈ సినిమా 2.35 కోట్ల షేర్‌ని సొంతం చేసుకుందని అంటున్నారు. ఈ సినిమా రెండో రోజు అక్కడ 1.1 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అమెరికాలో హాఫ్ మిలియన్ మార్క్ ని దాటేసింది. మొత్తంగా ఓవర్సీస్ లో 2 రోజుల్లోనే 3.45 కోట్ల రేంజ్ లో షేర్‌ని సొంతం చేసుకుని అప్పుడే లాభాల వేటలో ఉందని అంటున్నారు.

  బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రం కూడా మంచి విజయం దక్కించుకుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన విడుదలైంది. థమన్ సంగీతం అందించారు. ఈ సినిమాను ద్వారక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఇక అఖండ పూర్తవ్వడంతో బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టారు.

  Bheemla Nayak : భీమ్లా నాయక్ నుంచి నాల్గవ పాట విడుదల... అదిరిన అడవితల్లి మాట..

  క్రాక్ డైరక్టర్ గోపీచంద్‌  (Gopichand)దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. బాలయ్య గోపీచంద్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. త్వరలో షూటింగ్ మొదలుకానుంది. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించనుంది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter, and Google News)

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Akhanda movie, Balakrishna, Tollywood news

  ఉత్తమ కథలు